పోరాటానికి డాక్టర్లందరూ మద్దతివ్వండి

Mar 17,2024 21:02

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మిమ్స్‌ డాక్టర్లు మద్దతు ఇవ్వాలని ఉద్యోగులు, కార్మికులు కోరారు. ఈ పోరాటం ఆదివారం నాటికి 46 రోజులకు చేరుకున్న నేపథ్యంలో మిమ్స్‌లో పనిచేస్తున్న డాక్టర్లను కలిసి తమ పోరాటానికి మద్దతు తెలియజేయాలని, యాజమాన్యంతో మాట్లాడి సమస్యలు పరిష్కారానికై మీ వంతు కృషి చేయాలని ఉద్యోగులు కార్మికులు కోరారు. ఈ సందర్భంగా మిమ్స్‌లో పనిచేస్తున్న డాక్టర్‌ మల్లేశ్వరరావు, డాక్టర్‌ శ్రీరామమూర్తి, డాక్టర్‌ లెంక శ్రీనివాస్‌, డాక్టర్‌ అశోక్‌, డాక్టర్‌ జె.సి నాయుడు, డాక్టర్‌ జి.వి శేషగిరిరావు, మరికొంత మంది డాక్టర్లను కలసి పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు టివి రమణ, ప్రధాన కార్యదర్శి ఎం.నారాయణరావు, కె. మధు సూధనరావు, ఎం రాంబాబు, కె కామునాయుడు, అప్పలనాయుడు, ఎం ఆదినారాయణ, గౌరి, ఆదిలక్ష్మి, బంగారు నాయుడు, ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️