పోరాటాలకు సిద్ధం కావాలి : ఎస్‌ఎఫ్‌ఐ

ప్రజాశక్తి- పోరుమామిళ్ల జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు మరిన్ని పోరా టాలకు సిద్ధం కావాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు వినోద్‌ కుమార్‌ విద్యార్థులకు పిలుపునిచ్చారు. పట్టణంలోని వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహా సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్క రించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి కార్పోరేట్‌ విద్యా వ్యవస్థను పెంచి పోషిస్తుందన్నారు. సంక్షేమ హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌, కాస్మొటిక్‌ ఛార్జీలు విడుదల చేయకుండా వారి జీవితాలతో చెల గాటం ఆడుతుందన్నారు. అనంతరం ఎస్‌ఎఫ్‌క్ష్మి జిల్లా కార్యదర్శి సగిలి రాజేంద్ర ప్రసాద్‌ మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం వల్ల గ్రామీణ ప్రాం తాలలో చదవుతున్న పేద విద్యార్థులు విద్యకు దూరమై డ్రాపౌట్స్‌గా మిగిలే ప్రమాదం ఉం దన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా చదువుకున్న విద్యార్థులు వేల సంఖ్యలో చదువులు పూర్తి చేసుకుని బయటకు వస్తున్న వారికి ఉపాధి కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. చదువుకున్న అందరికి ఉపాధి కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గండి సునీల్‌ కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు రాహుల్‌, నాయక్‌, వినరు, సహాయ కార్యదర్శులు రవి, జిల్లా కమిటీ సభ్యులు వినరు, అజరు, రాజశేఖర్‌ పాల్గొన్నారు.

➡️