పోరాడి విజయం సాధించిన అంగన్వాడీలకు అభినందనలు : సిఐటియు

Jan 23,2024 14:45 #Anganwadi strike

ప్రజాశక్తి-అనంతపురం : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని 43 రోజుల పాటు పోరాడి.. ప్రభుత్వ మెడలు వంచి విజయం సాధించిన అంగన్వాడీలకు సిఐటియు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున అభినందనలు తెలిపారు. మంగళవారం రాయదుర్గంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా మండల అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు విజయోత్సవ సంబరాలను జరుపుకున్నారు. అంగన్వాడీలు ఏర్పాటు చేసిన కేకును సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున కట్‌ చేసి వర్కర్లకు అందించారు. ఇది సిఐటియు అండతో అంగన్వాడీ వర్కర్లు రాజీలేని పోరాటం చేసి సాధించిన విజయమని, ఎంతటి మొండి ప్రభుత్వానైనా.. మెడలు వంచి తమ హక్కులను సాధించుకుంటామని చాటి చెప్పిన ఈ పోరాటం చిరస్థాయిగా గుర్తుండిపోతుందని తెలిపారు. ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసిన ఎక్కడ కూడా తగ్గకుండా, బెదరకుండా రాష్ట్ర ప్రభుత్వానికీ ఎదురెళ్లి పోరాడి విజయం సాధించారని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా కార్మిక వర్గం హక్కుల కోసం వారి సంక్షేమం కోసం సిఐటియు చేసే పోరాటంలో కార్మికులందరూ ఇదే చైతన్యంతో పోరాడాలని పిలుపునిచ్చారు.

➡️