పోరుబాటలో అలుపెరగక…

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి ఎనిమిదవ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఆయా కార్యాలయాల ఎదుట బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా వంటావార్పు నిర్వహించారు. పలు చోట్ల భిక్షాటన చేశారు. మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. అంగన్వాడీలు మాత్రం సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె విరమించేది లేదంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ అంగన్వాడీలకు ముఖ్యమంత్రి ప్రతి పక్షంలో ఉన్నప్పుడు అధికా రంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ కన్నా అదనంగా రూ.వెయ్యి ఇస్తామన్న మాట అమలుచేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు పేర్కొ న్నారు. అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారానికి 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్‌ స్కీమ్‌ను కార్పొరేట్లకు కమీషన్‌ కోసం ప్రైవేటీకరించి పేద పిల్లలు, గర్భిణులు, బాలింతలకడుపు కొడుతూ వారి మరణాల పెంచడానికి కారణమవుతూ పేద ధనిక అంతరాలు పెంచుతూ సేలందించే అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నాయని పేర్కొన్నారు. సిఐటియు ంగన్వాడీలకు అండగా పోరాడుతుందన్నారు. అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలకొట్టడం పనికిమాలిన చర్యగా పేర్కొన్నారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట రోడ్డు పొడువునా భారీ లైనుతో వంటా వార్పు కార్యక్రమం ప్రజానీకాన్ని ఆకర్షించింది. రోడ్డపైనే సుమారు 700 మంది భోజనం వండుకుని తినడం విశేషం. వంటా వార్పు కార్యక్రమానికి విద్యుత్‌ రంగం నాయకులు ఎంవి.రమణ సుబ్ర హ్మణ్యం రాజు, ఆశా రంగం నాయ కులు ఆదిలక్ష్మి, సంగీత, పుష్పలత, కాంగ్రెస్‌ పార్టీ రైతు నాయకులు విఆర్‌డిఎస్‌ నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాం జులు, అంగన్వాడీ నాయకులు సిద్దమ్మ, భాగ్యలక్ష్మి, బంగారుపాప, మస్రూన్‌ బీ, ఖాజాబి, నాగమణి, సబీనా, విజయ, అరుణ, సుమలత, జయ, కవిత, లక్ష్మిదేవి, పద్మజ, రమణమ్మ, అంజలి, శైలజ, రెడ్డెమ్మ పాల్గొన్నారు. పీలేరు : అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు వారపు సంతలో భిక్షాటన చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. స్థానిక వారపు సంతలో వారు కొంగు పట్టి భిక్షాటన చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కారం చేయకపోతే సమ్మెను మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎన్ని కలకు ముందు తమకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు దనాసి వెంకటరామయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.ఎల్‌.నరసిం హులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే వేతనం కన్నా అదనంగా వెయ్యి రూపాయలు వేతనం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని అమలు చేయక పోవడం దురదష్టకరమని పేర్కొ న్నారు. కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఎపి గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్‌ నాయక్‌, ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ళ రంగారెడ్డి, ఎపి అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కన్వీనర్‌ నాగేశ్వరి, సిపిఐ పీలేరు నియో జకవర్గ కార్యదర్శి టి.ఎల్‌.వెంకటేష్‌, అంగన్వాడీలు పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ :డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు వివిధ రూపాలలో నిరసన తెలుపుతున్నారు. స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు సిఐటియు ఆధ్వ ర్యంలో వంటావార్పు కార్యక్రమం ద్వారా వినూత్నంగా నిరసన తెలిపారు. డిమాండ్లు నెరవేర్చవరకు ఉద్యమం ఆగదని ఈ సందర్బంగా అంగన్వాడీలు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేష్‌, అంగన్వాడీ వర్కర్లు రమాదేవి, సుజాత, ఈశ్వరమ్మ, శివరంజిని, విజయ, అమరావతి పాల్గొన్నారు. మదనపల్లి: స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు వంటావార్పు చేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు తెలకపల్లి హరింద్రనాథ్‌శర్మ, ప్రభాకర్‌రెడ్డి, మధురవాణి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెను నిర్వహిస్తున్నామని అందులో భాగంగా వంటావార్పు నిర్వహించి నిరసన తెలియజేశామన్నారు. అనంతరం బిసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బోడెం రాజశేఖర్‌ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో గౌరీ, కరుణ, స్వారూపా, భూకైలేశ్వరి, అమ్మాజీ, విజయ, అఖిరున్నిసా, బాగ్యా, గీతా సుజాని, శ్రీవాణి, ఈశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. రైల్వేకోడూరు :అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో వేతనాల పెంపు, గ్రాట్యూటీ తదితర సమస్యల సాధనకై చేపట్టిన సమ్మెలో భాగంగా అంగన్వాడీలు సమ్మె కొనసా గించారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు శ్రీలక్ష్మి, ప్రాజెక్టు గౌరవ అధ్యక్షులు, మంజుల, అధ్యక్షులు ఎన్‌.రమాదేవి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాధా కుమారి, మండల కార్యదర్శి జి.పద్మ, వెన్నెల, శిరీష, లీలావతి, ఈశ్వరమ్మ, మైతిలి, సునీత, నిర్మల, వాణి, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ చంద్రశేఖర్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు పి.జాన్‌ ప్రసాద్‌, అంగన్వాడీ వర్కర్స్‌ అసోసియేషన్‌ ఎఐటియుసి జిల్లా కో-కన్వీనర్‌ సరోజ, నాయకులు రాధాకృష్ణ పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి : న్యాయ మైన కోరికలు సాధనకు అంగన్వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. లక్కిరెడ్డిపల్లి సిడిపిఒ ప్రాజెక్ట్‌ కార్యాలయం వద్ద లక్కిరెడ్డిపల్లి, రామాపురం, గాలివీడు మండలాలకు చెందిన అంగన్వాడీలు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధ్యక్షులు సుకుమారి మాట్లాడుతూ ఎనిమిది రోజులుగా అంగన్వాడీ కార్మికులు రోడ్డుపైకి వచ్చి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించుకోవడం దారుణమన్నారు. న్యాయమైన కోరికలు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రూ.ఐదు లక్షల గ్రాట్యూటీ, కనీస వేతనం రూ.26 వేల రిటైర్మెంట్‌ పెన్షన్‌తో వేతనంలో సగం ఇచ్చేదాకా సమ్మె విరమించమన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సుకుమారి, ఓబుళమ్మ, ప్రభావతి, సెక్టార్‌ లీడర్లు శారదా, శ్రీవాణి, చిట్టెమ్మ, సుభాషిణి, ఇరాగమ్మ, రెడ్డెమ్మ, లక్ష్మీదేవి, నాగమణి, నాగవేణి పాల్గొన్నారు. అంగన్వాడీలకు మాజీ సర్పంచ్‌ చెండ్రా యుడు, రొండా చలపతి, మన్సూర్‌, రిజ్వాన్‌, ఇస్మాయిల్‌ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చెండ్రాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వేతనాలు రూ.4500 నుండి రూ.10,500లకు పెంచిన ఘనత చంద్రబాబు నాయు డుకు దక్కుతుందని తెలిపారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగ న్వాడీల న్యాయమైన కొరికలు నెరవేరుస్తుందన్నారు. బి.కొత్తకోట : తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ అంగన్వావాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. పట్టణంలోని జయశ్రీ కాలనీ అంగన్వాడీ కేంద్రం ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. బి.కొత్తకోట, ములకల చెరువు, పిటిఎం నుంచి వచ్చిన అంగ న్వాడీ టీచర్లు, హెల్పర్లు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయపరమైన డిమాండ్ల కోసం నిరసన తెలుపుతుంటే నిమ్మకు నీరెత్తన్నట్లు వ్యవహరిస్తుండడం బాధా కరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా బాధలను ఆలకించి సమస్యలను పరిష్క రించాలని విజ్ఞప్తి చేశారు. తంబళ్లపల్లె : అంగన్వాడీల సమస్యలను పరిష్కరిం చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివా సులు అన్నారు. తంబళ్లపల్లి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వా డీలు వంటావార్పు నిర్వహించారు. అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా వంటా వార్పులో పాల్గొన్న శ్రీనివాసులు మాట్లాడుతూ అంగన్వాడీల కోరికలు న్యాయ మైనవన్నారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు గొట్టడం చట్ట విరుద్ధమని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు స్వాధీనం చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రజలు స్వాధీనం చేసుకుంటే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. తక్షణం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అంగన్వాడీలకు మద్దతుగా ప్రజలను కూడగట్టి ఉద్యమం ఉధతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీల సమ్మెకు వెలుగు యానిమేటర్స్‌ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు గౌరి, కరుణశ్రీ, సులోచన, స్వరూప, ప్రమీల, సరస్వతి, ఉమాదేవి, షరీఫా, విఒఎ యూనియన్‌ నాయకులు రెడ్డెప్ప, రాణి, రాజేశ్వరి లతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, మినీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️