పోలమాంబ హుండీ ఆదాయం రూ.25.59 లక్షలు

Jan 31,2024 21:23

ప్రజాశక్తి – మక్కువ: శంబర పోలమాంబ అమ్మవారి జాతర సందర్భంగా భక్తుల సమర్పించుకునే ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. దేవాదాయశాఖ జిల్లా అధికారి డివివి ప్రసాదరావు, తనిఖీదారు ఎన్‌.రాజకుమారి, ఆలయ ఇఒ వివి సూర్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక చదురు గుడిలో ఈ లెక్కింపు జరిగింది. రెండు వారాలకు సంబంధించి రూ.25 లక్షల 59వేల 843 ఆదాయం లభించినట్లు ఇఒ వెల్లడించారు. గత ఏడాదిని బట్టి పోల్చి చూస్తే సుమారు రూ.4 లక్షలు పైబడి ఆదాయం ఎక్కువ వచ్చినట్టు పట్టిక పట్టి తెలుస్తుంది. లెక్కింపులో తహశీల్దార్‌ సూర్యనారాయణ. ఎస్‌ఐ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️