పోలింగ్‌ కేంద్రాల్లో పరిశీలన

Jan 9,2024 19:50
పోలింగ్‌ కేంద్రంలో పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌

పోలింగ్‌ కేంద్రంలో పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌
పోలింగ్‌ కేంద్రాల్లో పరిశీలన
ప్రజాశక్తి -ఉలవపాడు : ఉలవపాడులో మంగళవారంకందుకూరు సబ్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ళ విద్యాధరి గ్రామ సచివాలయాలలు, పోలింగ్‌ కేంద్రాలు, అంగన్‌వాడీ సెంటర్లను సందర్శించారు. ఆమె ఉలవపాడు లోని 1వ సచివాలయాన్ని సందర్శిం చారు. కార్యాలయం పక్కన గల కోనేరులో నీరు అపరిశుభ్రంగా ఉండటం గమనించి వెంటనే చెత్తాచెదారం,నీటిని శుభ్రపరచాలని గ్రామ కార్యదర్శి బి. విజయమ్మను ఆదేశించారు. కార్యాలయంలోని రికార్డులను, హాజరు పుస్తకాలను ఆమె పరి శీలించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాలు, పోలింగ్‌ పోలింగ్‌ కేంద్రాలను సంద ర్శించి పరిసరాలను పరిశీలించారు. ఆమె వెంట తహశీల్దార్‌ ఆర్‌. బ్రహ్మయ్య సచి వాలయ కార్యదర్శులు బి విజయమ్మ, రెవెన్యూ గ్రామంకార్యదర్శి పేరయ్య, రిటైర్డ్‌ ఉద్యోగులు ఎన్టీ రామ్‌ కుమార్‌, బడితుల వెంకటేశ్వరరావు, ఎం మురళీకష్ణ, ఆవుల వెంకటేశ్వర్లు ఉన్నారు.

➡️