పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ

ప్రజాశక్తి-త్రిపురాంతకం: త్రిపురాంతకం లోని పోలీస్‌ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలిం చారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. శివరాత్రి వేడుకలను దృష్టిలో పెట్టుకొని పోలీస్‌ శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 150 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దర్శి డిఎస్పీ అశోక్‌ వర్ధన్‌, త్రిపురాంతకం సిఐ సుబ్బారావు, ఎస్‌ఐ సాంబశివరావు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️