‘ప్రకృతి’ వనరుల కేంద్రం ప్రారంభం

Dec 23,2023 00:32 #వాకా మాధవి

ప్రజాశక్తి- కొత్తపట్నం : ఒంగోలు నగర పరిధిలోని కొప్పోలు గ్రామంలో రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ నేచురల్‌ ఫార్మింగ్‌ ఆధ్వర్యంలో ప్రకతి వ్యవసాయ వనురుల కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం సిబ్బంది వాకా మాధవి మాట్లాడుతూ ఈ కేంద్రంలో అన్ని రకాల పురుగుల నివారణకు కాషాయాలు , పంట ఎదుగుదలకు ద్రావణాలు, పసుపు రంగు జిగురు అట్టలు, లింగాకార్షక బుట్టలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన శనగలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకతి వ్యవసాయ సిబ్బంది ఐసిఆర్‌పిలు సుభాషిణి, అమరవాణి, రజియా, రైతులు మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

➡️