ప్రజలంతా మద్దతివ్వాలి

ప్రజాశక్తి-చీరాల: వైసీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు సీఎం జగన్మోహన్‌ రెడ్డి అవకాశం కల్పించారని, ప్రజలందరూ తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్‌ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలో తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మున్సిపల్‌ పరిధిలోని పలు వార్డులలో పర్యటిస్తూ ఆ ప్రాంత నాయకులు, వ్యాపారులు, కలుస్తూ తనకు మద్దతు తెలియజేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణంలోని 23వ వార్డులో జాలమ్మ అమ్మవారి గుడిలో, ఎంజిసి కార్‌ మార్కెట్‌ సమీపంలోని వినాయకుడి గుడి వద్ద, పేరాల ముత్యాల పేటలోని మహాలక్ష్మమ్మ అమ్మవారి చెట్టు వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో మునిసిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, వైస్‌ చైర్మన్‌ బొనిగల జైసన్‌ బాబు, పట్టణ అధ్యక్షులు కొండ్రు బాబ్జీ, తోకల అనిల్‌, గోలి స్వాతి, కీర్తి వెంకట్రావు, బత్తుల అనిల్‌, చీమకుర్తి బాలకృష్ణ, గోలి జగదీష్‌, గోలి గంగాధర్‌, సల్లూరి సత్యానందం, చిలుకోటి శ్రీనివాసరావు, మామిడాల సుబ్బారావు, వాసిమల్ల వాసు తదితర నాయకులు పాల్గొన్నారు.

➡️