ప్రజాసేవకే మేకపాటి కుటుంబం అంకితం

Feb 26,2024 21:33
ఫొటో : ప్రజలకు అభివాదం చేస్తున్న మేకపాటి రాజగోపాల్‌రెడ్డి

ఫొటో : ప్రజలకు అభివాదం చేస్తున్న మేకపాటి రాజగోపాల్‌రెడ్డి
ప్రజాసేవకే మేకపాటి కుటుంబం అంకితం
ప్రజాశక్తి-జలదంకి : ప్రజాసేవకే మేకపాటి కుటుంబం అంకితం అని ఉదయగిరి వైసిపి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి తెలిపారు. సోమవారం జలదంకి మండలంలోని కొత్తపాలెంలో విజయసంకల్పయాత్ర స్థానిక సర్పంచ్‌ చెరెడ్డి శుభరత్తమ్మ, చేరెడ్డి మస్తాన్‌ రెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించారు. 45సంవత్సరాలుగా ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి సానిహిత్యం ఉందన్నారు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, ఎంతో అభివృద్ధి చేశామని నియోజకవర్గ ప్రజలు తమ కుటుంబంపై చూపిస్తున్న ప్రేమను ఎన్నటికీ మర్చిపోమన్నారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో 200ఎకరాల భూమిని, ఇంజనీరింగ్‌ కాలేజీని ప్రభుత్వానికి, వ్యవసాయ కళాశాల ఏర్పాటు కోసం ఇచ్చామన్నారు. మేకపాటి రాజమోహన్‌ రెడ్డి ఎంపిగా ఉదయగిరిలో డిగ్రీ కాలేజీ కృష్ణాపురంలో నవోదయ పాఠశాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజాసేవకే తాను రాజకీయాల్లోకి వచ్చానని, వచ్చే ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరల రాష్ట్రానికి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే కులమతాలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. వైసిపికి అండగా నిలిచి ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను ఎంఎల్‌ఎ అయితే కొత్తపాలెంలో ఉన్న ఇనాం భూములను రైతులకు ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మండల వైసిపి కన్వీనర్‌ పాలవల్లి మాలకొండారెడ్డి, జెడ్‌పిటిసి మేదరమెట్ల శివ లీలమ్మ, సొసైటీ అధ్యక్షులు కేతిరెడ్డి రవీంద్రారెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి ఇస్క మదన్మోహన్‌ రెడ్డి, కొత్తపాలెం మాజీ ఎంపిటిసి బిజ్జం ఎరుకలరెడ్డి, సోమరుపాడు మాజీ సర్పంచ్‌ చేవూరి శ్రీనివాసుల రెడ్డి, జిల్లా వ్యవసాయ జనరల్‌ సెక్రెటరీ రవి ప్రసాద్‌ నాయుడు, సర్పంచులు తమ్మినేని సతీష్‌ బాబు, బోడిమల్ల కృష్ణారెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం వైస్‌ ప్రెసిడెంట్‌ గుణపాటి సురేష్‌ రెడ్డి, నాయకులు గోపాల్‌ రెడ్డి, బాబుల్‌ రెడ్డి, ఆవల చిన్న రాఘవరెడ్డి, గుణపాటి రమేష్‌ రెడ్డి, గుణపాటి వెంకటేశ్వర రెడ్డి, సురే శేషారెడ్డి, దేవరపల్లి మధుసూదన్‌ రెడ్డి, గుమ్మలంపాటి సుబ్బారావు, సుబ్బారెడ్డి, వైసిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

➡️