ప్రజా సంక్షేమానికే పథకాలు : రాజన్నదొర

Jan 5,2024 20:44

 ప్రజాశక్తి – మక్కువ  :  ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతుందని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. మండలంలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛను రూ.2750 నుండి ప్రభుత్వం రూ.3 వేలకు పెంచిందన్నారు. పు జరిగిందని ఆయన అన్నారు. అవ్వాతాతలకు, మహిళలకు ఈ పథకం ఎంత చేయూతనిస్తుందన్నారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి మర్రి పారమ్మ, జెడ్పీటీసీ మావుడి శ్రీనివాసునాయుడు, వైసిపి నాయకులు మావుడి రంగునాయుడు, దండి శ్రీనివాసరావు, తహశీల్దార్‌, ఎంపిడిఒ, ఎపిఒ తదితరులు పాల్గొన్నారు.

సాలూరు: స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో పెంచిన పింఛను మొత్తాలను లబ్ధిదారులకు డిప్యూటీ సిఎం రాజన్నదొర పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్‌ చైర్మన్లు జర్జాపు దీప్తి, వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్లు గొర్లి వెంకటరమణ, పి.సన్యాసమ్మ, మాజీ కౌన్సిలర్‌ ఎం.అప్పారావు, మున్సిపల్‌ కమిషనర్‌ జయరాం పాల్గొన్నారు.

పాలకొండ : స్థానిక కోటదుర్గ ఆలయ ఆవరణలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ విక్రాంత్‌ పాల్గొన్నారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ రౌతు హనుమంతరావు, కౌన్సిలర్లు వెలమల మన్మధరావు, బాసురు కాంతారావు, కడగల రమణ, కొంచాడ అరుణ్‌, తూముల లక్ష్మణ, కిల్లారి మోహన్‌, నీలాపు శ్రీను, విజయ కుమార్‌, కమిషనర్‌ సర్వేశ్వరరావు తదితరులు ఉన్నారు.

సీతానగరం : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో వైఎస్‌ఆర్‌ పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే ఎ.జోగారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవానికి ప్రభుత్వం పింఛను అందజేస్తుందన్నారని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి బి.రమణమ్మ, జడ్పిటిసి ఎం.బాబ్జీ, ఎంపిడిఒ ఎంఎల్‌ఎస్‌ఎన్‌ ప్రసాద్‌, మండల వైసిపి అధ్యక్షులు బి.చిట్టిరాజు, ఉపాధ్యక్షుడు బి.శ్రీరాములునాయుడు, మండల కార్యదర్శి బి.సూర్యనారాయణ, ఎంపిటిసి సభ్యులు బి.కుసుమ సూర్యనారాయణ, సురగాల గౌరీకిరణ్‌, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వీరఘట్టం: మండల కేంద్రంలోని సచివాలయం-2 పరిధిలోని కస్పా వీధిలో సచివాలయ కన్వీనర్‌ దూషి జానకమ్మ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తున్నారని ఇందులో భాగంగా రూ.3వేలుకు పింఛను పెంచినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు, పింఛనుదార్లు పాల్గొన్నారు.

➡️