ప్రణాళికా బద్దమైన అభ్యాసన అవసరం

Feb 6,2024 20:59

ప్రజాశక్తి – నెల్లిమర్ల : విద్యార్థులకు ప్రణాళికా బద్ధమైన అభ్యాసన, బోధనలు ఉండాలని డిప్యూటి డిఇఒ కె. వాసుదేవరావు, డైట్‌ ప్రిన్సిపాల్‌ ఎన్‌. తిరుపతి నాయుడు సూచించారు. మంగళ వారం స్థానిక కెజిబివి పాఠశాలను జిల్లా మోనటిరింగ్‌ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా డిప్యూటి డిఇఒ వాసుదేవరావు, డైట్‌ ప్రిన్సిపాల్‌ తిరుపతి నాయుడు 6,7,8, 10తరగతి విద్యార్ధుల అభ్యాసన, బోధన తదితర అంశాలపై పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రణాళికా బద్ధంగా అభ్యాసన, బోధనలు ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడ్డ విద్యారులను గుర్తించి ఉపాధ్యాయులు మెరుగైన బోధనలు అందించి ముందుకు తీసుకుని రావాల్సిన బాధ్యత ఉందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, టైం టేబుల్‌ ప్రకారం ప్రాజెక్టు వర్కులు పూర్తి చేసేవిధంగా కృషి జరగాలని, 10పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఉమా, డైట్‌ లెక్చరర్స్‌ శ్రీనివాస్‌, సూర్యారావు, రామకృష్ణ, బృంద సభ్యులు ఎ ప్రవీణ్‌ కుమార్‌, దామోదర నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️