ప్రతిరైతునూ ప్రభుత్వం ఆదుకుంటుంది : మంత్రిర రజిని

మిర్చి పొలాన్ని పరిశీలిస్తున్న మంత్రి రజిని
ప్రజాశక్తి – నాదెండ్ల :
తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పొలాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని శుక్రవారం పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. మండలంలోని తూబాడు, బుక్కాపురం గ్రామాల్లో పర్యటించిన మంత్రి మిర్చి, పత్తి, శనగ పొలాలు దెబ్బతినగా వాటిని పరిశీలించి రైతుల నుండి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పంట నష్టపోయిన ప్రతిరైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని, ఏ ఒక్క రైతు ఆందోళనకు గురవ్వాల్సిన పనిలేదని అన్నారు. పరిశీలనలో అధికారులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.

➡️