ప్రతి విద్యార్థికీ లక్ష్యం ముఖ్యం డిఆర్‌డిఒ డైరెక్టర్‌ జనరల్‌ ఎం.కె. హడ

ప్రజాశక్తి-మదనపల్లి ప్రతి విద్యార్థికీ లక్ష్యమనేది చాలా ముఖ్యమని, ఆ లక్ష్యం కోసం ఇష్టపడి చదవాలని న్యూఢిలీకి చెందిన డిఆర్‌డిఒ డైరెక్టర్‌ జనరల్‌ ఎం. కె. హడ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌లో ఫ్రెషర్స్‌ డే ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్ధి దశ మీ వందేళ్ల జీవితానికి పునాది అని అన్నారు. విద్యార్ధి దశను ఎంజారు చేస్తూ తమ లక్ష్యాన్ని సాధించాలని పేర్కొన్నారు.. మీకు ముఖ్య ంగా ఏ రంగం ఆసక్త్తో అందులోనే మీరు పట్టు సాధించ ాలని చెప్పారు. కలలు సాధించడం మీ చేతి లోనే ఉంది అనేది గుర్తు పెట్టుకోవాలని అన్నారు. సమాజానికి పనికొచ్చే విధంగా సాంకేతిక రంగంలో కొత్త పరిశోధనలు చేయాలని ఆయన అన్నారు. కళాశాల కరెస్పాండంట్‌ డాక్టర్‌ ఎన్‌. విజయభాస్కర్‌ చౌదరి మాట్లాడుతూ తమ కళాశాల మీద నమ్మకంతో మీ తల్లి దండ్రులు మిమల్ని చేర్పించి చదివిస్తున్నారని, అంతే నమ్మకంతో మీ భవిష్యత్తు ను ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తామని ఆయన అన్నారు. బి.టెక్‌ విద్యార్థులకు నాలుగు సంవత్సరాలు ఎంసిఎ, ఎంబిఎ విద్యార్థులు రెండేళ్లు చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఎం..కె హడ దేశానికి చాలా ముఖ్యమైన వ్యక్తి అని, డిఫెన్సె రీసెర్చ్‌ డెవలప్మెంట్‌ అనేది ఎంతో ముఖ్యమైన సంస్థ అని చెప్పారు. ఆయన సమయాన్ని మనకోసం కేటాయించి ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్‌ఆర్‌ఆర్‌ అకాడమీ ప్రెసిడెంట్‌ నాదెళ్ల ద్వారకానాథ్‌, ప్రినిపల్‌ డాక్టర్‌ సి. యువరాజ్‌, ఫస్ట్‌ ఇయర్‌ కో – ఆర్డినేటర్‌ డాక్టర్‌ చంద్ర మోహన్‌, విద్యార్థులుపాల్గొన్నారు.

➡️