ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో అగ్ని ప్రమాదం

Jan 17,2024 16:31 #srikakulam

ప్రజాశక్తి-టెక్కలి రూరల్‌(శ్రీకాకుళం) : టెక్కలి ప్రభుత్వ పాఠశాలలో బుధవారం ఉదయం షార్ట్‌ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఉదయాన్నే పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థులు దీనిని గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అగ్ని ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ప్రధానోపాధ్యాయులు నాగభూషణంరావు పాఠశాలకు చేరుకుని ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

➡️