ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు బీరువా అందజేత

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 1976-78, 1980-82 సంవత్సరాలలో ఇంటర్మీడియట్‌ చదివిన పూర్వ విద్యార్థులు జరుపుకున్న ఆత్మీయ సమ్మేళనానికి గుర్తుగా తాము చదువుకున్న యర్రగొండపాలెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు గురువారం వస్తువులను బహూకరించారు. 67 కేజీల బరువు గల ఐరన్‌ బీరువా, 4 కుర్చీలను కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌ కెవి నారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ యర్రగొండపాలెంలో మొదటిసారిగా 1976లో ఇంటర్మీడియట్‌ కాలేజీ ప్రారంభించారని చెప్పారు. తాము కూడా ఆ కాలేజీలోనే చదువుకున్నామని తెలిపారు. తాము చదువుకున్న కాలేజీకి గుర్తుగా బీరువా, కుర్చీలు బహూకరిం చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పి రామసుబ్బయ్య, సూరే వెంకటస్వామి, జ్యోతి ప్రసాదరావు, అన్నంరాజు మురళీకృష్ణ, జార్జి, ఖాసీం, ప్రభాకర్‌, హేమలత, జ్యోతి సీతమ్మ, వెంకటేశ్వరరావు, యక్కలి శివ, కాలేజీ స్టాఫ్‌ ఆదిశేషిరెడ్డి, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️