ప్రభుత్వ డిగ్రీ కాలేజీల సంఖ్య పెంచండి

 నరసరావుపేట: భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ ఎఫ్‌ ఐ) రెండవ పల్నాడు జిల్లా మహాసభ నరసరావుపేట లోని పల్నాడు విజ్ఞాన కేం ద్రం లో షేక్‌ సాబ్జి ఎమ్మెల్సీ ప్రాం గణంలో నిర్వహించారు.. జెండా వందనం చేసి, అమరవీరులకు సంతాపం తెలిపిన అనం తరం మహాసభను ప్రారంభించారు. ఈ మహాసభలో జిల్లా నూతన కార్యదర్శిగా కోట సాయికుమార్‌, అధ్య క్షుడిగా ఎస్‌.రాజు ఎన్నుకున్నారు. ఈ కార్య క్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉపా ధ్యక్షుడు వినోద్‌ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు కేవలం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు రెండు మాత్రమే ఉన్నాయని,పల్నాడు జిల్లాలో నియోజక వర్గానికి ఒక డిగ్రీ కాలేజ్‌, మండలానికి ప్రభుత్వ కాలేజీని నిర్మించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కార్యదర్శి కోట సాయి కుమార్‌ మాట్లాడుతూ నియోజక వర్గ కేంద్రాల్లో ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఏర్పాటు చేయాలని జిల్లాలో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలపౖౖె చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ హాస్టల్లో మౌలిక సదుపాయాలు మెరుగ్గా పెంచి, మెస్‌ ఛార్జీలు పెంచాలని అన్నారు. కార్య కమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయ కులు అమూల్య, రాఘవ, జ్యోతిష్‌, నరేంద్ర పాల్గొన్నారు.

➡️