ప్రభుత్వ నిరంకుశత్వం నశించాలి : యుటిఎఫ్‌

భోగి మంటల్లో ప్రభుత్వ నిర్బంధ పత్రాలు దహనం ప్రజాశక్తి-కడప ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిరంకుశ, నిర్బంధ తీరు నశించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ రాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాళెం మహేష్‌ బాబు తెలిపారు. ఆదివారం భోగి పండుగను పురస్కరించుకుని యుటిఎఫ్‌ భవన్‌ ఎదుట భోగిమంటల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ నిరంకుశ విధానాలు నశించాలంటూ ఉపాధ్యాయుల నిర్బంధాలకు సంబంధించిన పత్రాలను భోగిమంటల్లో దహనం చేస్తూ నినాదాలు చేశారు. న్యాయబద్ధంగా తమకు రావలసిన ఆర్థిక బకాయిలను ప్రభుత్వం చెల్లించకుండా కాలయాపన చేస్తూ ఉపాధ్యాయులను వేధించడం మంచిది కాదని ఉపాధ్యాయుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేక విధానాలు నేటితో ఈ భోగిమంటల్లో నశించి సంక్రాంతి పండుగకు పురస్కరించుకునైనా డిఎ, పిఆర్‌సి, సరెండర్‌ లీవ్‌, ఎపి జిఎల్‌ఐ, మెడికల్‌ రియంబర్స్మెంట్‌, సిపిఎస్‌ ఉద్యోగుల అరియర్స్‌ తదితర ఆర్థిక బకాయిలన్నీ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో ఉద్యమం తీవ్రతరం చేసి ప్రభుత్వం మెడలు వంచైనా న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరిం చుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్‌ నరసింహారావు, జిల్లా కార్యదర్శులు సి.వి. రమణ, ఏజాస్‌ అహ్మద్‌, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ప్రభాకర్‌, నాయకులు గంగన్న, శంకర్‌ బాబు, గోపాల్‌ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, విశ్వనాథ్‌, ప్రకాష్‌ బాబు, మజ్జారి చెన్నకేశవులు, శ్రీనివాసులు, వీరనారాయణ, దేవ దత్తం, శివశంకర్‌, కిరణ్‌ కుమార్‌, సుబ్బారావు, సుబ్బారెడ్డి, కిరణ్‌ బాబు, వెంకటరమణ, కరిముల్లా, సురేంద్ర నాథ్‌ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు గంగరాజు పాల్గొన్నారు. బద్వేలు : ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అన్ని రకాల బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లించే వరకు తమ పోరాటం ఆగదని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు మాదన విజయ కుమార్‌ హెచ్చరించారు.ఆదివారం బద్వేలు పట్టణంలో భోగి పండుగను పురస్కరించుకొని యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ అప్రజాస్వామిక, అహంకారపూరిత, నిరంకుశ వైఖరులను భోగిమంటల్లో దగ్ధం చేస్తూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల అండదండలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌ ఉద్యోగుల పట్ల అప్రజా స్వామికంగా, అహంకారపూరితంగా, నిరంకుశంగా వ్యవహరిస్తుందని పేర్కొ న్నారు. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జిల్లా కేంద్రంలో రిలే దీక్షలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యులు టి.శివ ప్రసాద్‌, బద్వేలు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌. దేవానందం, కె.సుధాకర్‌, గోపవరం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరదాసరి క్రిస్టఫర్‌, వి.కష్ణుడు, ట్రెజరర్‌ ఎం.రామచంద్రయ్య, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు ఎస్‌.చెన్నయ్య, ఎస్‌.మస్తాన్‌ వల్లి, ఎన్‌.పవన్‌ కుమార్‌, ఎస్‌.ఎం.డి.గౌస్‌, కె.ఈశ్వరయ్య, టి.పెంచలయ్య, కె.శ్రీనివాసులు, ఎం .గుర్రయ్య, ఎన్‌.నరసింహులు, వి.హిమ శైలజ, బి.సుమలత పాల్గొన్నారు. పోరుమామిళ్ల : ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి కుర్ర చెన్నయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు భైరవ ప్రసాద్‌ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం భోగి పండుగ సందర్భంగా ఉపాధ్యాయులకు రావలసిన బకాయిల మీద, నిరసన కార్యక్ర మాన్ని యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ పోరుమామిళ్ల రీజియన్‌ సభ్యులు గఫర్‌, ఈశ్వరరావు, నాయబ్‌ రసూల్‌, చెన్న కష్ణయ్య, కష్ణయ్య, జాషువా, సురేష్‌ కుమార్‌, సుగుణ రావు, జగన్‌ మోహన్‌ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, సిద్దయ్య, సింహరాయలు, బాషా పాల్గొన్నారు.

➡️