ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు

Dec 18,2023 23:41
అంగన్‌వాడీల సమస్యల

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి, పెద్దాపురం

అంగన్‌వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా డివిజన్‌ పరిధిలోని అంగన్‌వాడీలు సోమవారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయం వద్ద యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ అధ్యక్షతన మహా ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐవి మాట్లాడుతూ తెలంగాణ కంటే అదనంగా వేతనాలను పెంపుదల చేస్తానని జగన్‌ ఇచ్చిన హామీ ఆర్థిక అంశం అయినప్పుడు, ప్రభుత్వ ఉన్నత అధికారులు ఆర్థిక డిమాండ్లు తప్ప అన్ని పరిష్కరిస్తామనడంలో అర్థం లేదని అన్నారు. అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించడంతో ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని మండిపడ్డారు. పాదయాత్రలో జగన్‌ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, జిల్లా కోశాధికారి మలకా రమణ, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రవతి మాట్లాడుతూ అంగన్‌ వాడీల సమ్మె ప్రారంభమై 7 రోజులు గడుస్తున్నా ప్రభుత్వ వైఖరిలో మార్పురాలేదన్నారు. అధిక ధరలతో సతమతమవుతున్న అంగన్‌వాడీలు కనీస వేతనాలు చెల్లించమంటే జగన్‌ ప్రభుత్వం నిరాకరిస్తుందన్నారు. సిపిఎం జిల్లా కన్వీనర్‌ మోర్త రాజశేఖర్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. స్కీమ్‌ వర్కర్ల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణి సరైంది కాదన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌ ఇళక్కియాకి అందించారు. ఈ కార్య క్రమంలో బిఎస్‌పి జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మ ణ్యం, ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వరద రాజ సాంచి, నరాల శివ, కృష్ణమోహన్‌, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తి రాజు, జిజిహెచ్‌ మెస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కృష్ణ, ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, యు.కొత్తపల్లి మండల సిఐటియు కన్వీనర్‌ సత్యనారాయణ, కాళ్ల నాగేశ్వరరావు మద్దతుగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి రమణమ్మ, ప్రాజెక్ట్‌ నాయకులు జ్యోతి, ధనలక్ష్మి, నీరజ, తులసి, అమలావతి, వీరవేణి, వీరమణి, తదితరులు పాల్గొన్నారు. పెద్దాపుర ఆర్‌డిఒ కార్యాలయం వద్ద అంగన్‌ వాడీల ధర్నాలో ఎం ఎల్‌సి ఐవి పాల్గొని మాట్లా డారు. డ్వాక్రా ఆర్‌పి యూనియన్‌ నాయకులు జయలక్ష్మి, భవా నీలు సంఘ సభ్యులతో వచ్చి అంగన్‌వాడీలకు మద్దతు తెలిపారు. ఈ కార్య క్రమంలో ప్రజానాట్య మండలి కళాకారులు గీతా లను ఆలపించారు. ఈ కార్యక్రమంలో యూని యన్‌ నాయకులు దాడి బేబీ, అమల, నాగమణి, జగ్గంపేట ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు సుజాత, రత్నం, శంఖవరం ప్రాజెక్టు, పత్తిపాడు ప్రాజెక్టు యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు. పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ధర్నాకు సంఘీభావం తెలిపారు

➡️