ప్రమాదంలో యువకుడు మృతి : కుటుంబాన్ని పరామర్శించిన నక్కా ఆనందబాబు

ప్రజాశక్తి-వేమూరు (బాపట్ల) : రోడ్డు ప్రమాదంలో యువకుడు మరణించాడు. అతడి కుటుంబాన్ని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మంగళవారం పరామర్శించారు. చుండూరు మండలం వలివేరు గ్రామానికి చెందిన లచ్చి సతీష్‌ (21) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్‌ లో చికిత్స తీసుకుంటూ నిన్న చనిపోయాడు. ఈరోజు అతడి భౌతికకాయాన్ని నక్కా ఆనందబాబు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.

➡️