ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ప్రజాశక్తి-రాయచోటి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు మొదటి రోజు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 54 కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకుని, తమ హాల్‌ టికెట్‌ నెంబర్ల ఆధారంగా తమకు కేటాయించిన గదుల అన్వేషణలో పడ్డారు. తల్లిదండ్రులు కొందరు తమ పిల్లలతో కలిసి వచ్చి పరీక్షా కేంద్రంలో వారికి కేటాయించిన గదుల వెతకడంలో సాయపడటం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా మొత్తం 15,492 మంది విద్యార్థులు ఉండగా 14,709 మంది హాజరయ్యారు. 783 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్‌ 14,194 విద్యార్థులు ఉండగా 13,528 మంది హాజరు కాగా 666 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ కోర్స్‌లో 1,298 మంది మొత్తం విద్యార్థులు ఉండగా 1,181 మంది విద్యార్థులు హాజరుకాగా 117 మంది గైర్హాజరయ్యారు. రాయచోటి పట్టణంలో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6,184 మంది విద్యార్థులు ఉండగా 6,082 మంది హాజరుకాగా 102 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలను చీప్‌ సూపపరింటెండెంట్‌ ఆఫీసర్లు 54, అడిషనల్‌ స్టాప్‌ సూపర్నెంట్‌ 26, ప్లేయింగ్‌ స్క్వాడ్‌ ముగ్గురు, 1,065 ఇన్విజిటేటర్లును ఏర్పాటు చేశారు. పరీక్ష జరిగే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం, మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. పరీక్ష సమయంలో విద్యుత్‌ అంతరాయం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రతి సెంటర్‌ నందు ఎఎన్‌ఎం, తాగనీరు, మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేశారు. జిరాక్స్‌ సెంటర్‌ను మూసి వేయించారు. సెల్‌ ఫోన్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులను నిషేధించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పీలేరు: ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలకు 1,276 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 1,212 మంది మాత్రమే హాజరయ్యారు. 64 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కలకడ: మండలంలో 377 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 363 మంది హాజరు కాగా 14 మంది విద్యార్థులు గైర్హాజ రయ్యారు. నిమ్మనపల్లి: మండలంలో 171 మంది విద్యార్థులకు గాను 165 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆరుగురు గైర్హాజరయ్యారు. పరీక్షలను చీఫ్‌ సూపరింటెండెంట్‌ రాధాకష్ణ, చేగు రెడ్డప్పరెడ్డిలు పర్యవేక్షించారు. పుల్లంపేట : మండల కేంద్రంలోని ఎస్‌బివిడి సభ కళాశాలలో శుక్రవారం ప్రారంభమైన ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షకు 119 విద్యార్థులు హజరవ్వాల్సి ఉండగా నలుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు ఎగ్జామ్‌ సెంటర్‌ చీఫ్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. తంబళ్లపల్లి : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రంలో 147 మంది విద్యార్థులకు గాను 141 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని చీఫ్‌ ఎగ్జామినర్‌ సాయి శంకర్‌రెడ్డి తెలిపారు.

➡️