ప్రాచీన సాహిత్యంపై అధ్యయనం అవసరం

Nov 27,2023 00:36 #arasam, #papineni

గుంటూరు జిల్లా ప్రతినిధి: నేటి తరం సాహిత్య కారులు ప్రాచిన సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ ప్రముఖ కవి, విమర్శకులు, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్‌ అన్నారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక అన్నమయ్య గ్రంథాలయంలో నిర్వహించిన మంచిపుస్తకాల ఆవిష్కరణ సభ జరిగింది. ‘తాపీ ధర్మారావు జీవితం’ రచనలు పుస్త కాన్ని శివశంకర్‌ ఆవి ష్కరిం చారు. పులుపుల వెంకట శివయ్య గేయాలు, వ్యాసాలు’ పుస్తకాన్ని అరసం నాయకులు ఓబులేసు ఆవిష్కరించారు. శివశంకర్‌ మాట్లాడుతూ ప్రాచీన ఆధునిక సాహిత్యాలకు వారధి తాపీ ధర్మారావు అన్నారు. నేటి విశ్వవిద్యాలయాలలో పరిశోధనా పద్దతులు దిగజరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓబులేసు మాట్లాడుతూ నేటి సమాజం రాజ కీయ సాంఘిక రంగాలలో అనేక రుగ్మతలకు లోనైందని అన్నారు. అరనం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ పుస్త కాలను సమీ క్షిస్తూ ఉద్యమ సంస్థగా అరసం ఆంధ్రప్రదేశ్‌ శాఖ విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తోందని అభినందించారు. సభకు అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్‌ అధ్యక్షత వహిం చారు. ఈ సందర్భంగా ఈ తరం కోసం వచన కవిత, కుందుర్తి కవిత, తిలక్‌ కవిత సంపు టాలను అరసం రాష్ట్ర కారదర్శి కె. శరత్చంద్ర జ్యోతిశ్రీ ఆవిష్క రించారు. అనంతరం అరసం డిజిటల్‌ ఛానల్‌ను ఓబులేసు ఆవిష్కరించారు. అనంతరం ఉమ్మడి గుంటూరు జిల్లా అరసం కార్యవర్గాన్ని వల్లూరు శివప్రసాద్‌ ప్రకటించారు.గౌరవాధ్యక్షులుగా కె.రామకృష్ణారెడ్డి, అధ్యక్షులుగా సిహెచ్‌ సింగా, ఉపాధ్యక్షులుగా డాక్టర్‌ జి.స్వర్ణలత, జి.సీతారామయ్య, కె.బెనహర్‌ ప్రధాన కార్యదర్శిగా కె. రవికుమార్‌, కార్యదర్శులుగా గంగోత్రి సాయి, బుల్లా రవి, కార్యవర్గ సభ్యులుగా కె.శివరామిరెడ్డి, ఎంవిఎస్‌ ప్రసాద్‌, ఆర్‌.పీటర్‌, ఎస్‌ ఎమ్‌ సుభాని, ఎం.శ్రీనివాసరావు, డి.వినోద్‌, బి.భగత్‌సింగ్‌, కె.శరత్‌, ఎఎమ్‌ఆర్‌ ఆనంద్‌, వి.శివప్రసాద్‌లను ప్రకటించగా సభ ఆమోదించింది.

➡️