ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం

Feb 26,2024 21:38

 ప్రజాశక్తి-విజయనగరం కోట  : ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం చేయాలని పోలీసు అధికారులకు ఎస్‌పి ఎం.దీపిక సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుండి 41 ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత పోలీసు అధికారులతోఫోనులో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.ఫిర్యాదులపై తీసుకున్న చర్యల నివేదికలను జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపుఎస్పీ అస్మా ఫర్హీన్‌, ట్రాఫిక్‌ డిఎస్‌పి డి.విశ్వనాధ్‌, ఎస్‌బి సిఐలు కె.కె.వి. విజయనాధ్‌, ఇ.నర్సింహమూర్తి, డిసిఆర్‌బి ఎస్‌ఐ గణేష్‌, ప్రభావతి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️