ఫిష్‌ ఆంధ్ర డెయిరీ ప్రారంభం

Dec 28,2023 21:46

ప్రజాశక్తి – కురుపాం : ఫిష్‌ ఆంధ్ర డెయిరీని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి కోరారు. గురువారం మండలంలో గుమ్మ పంచాయతీ కోనగూడ గిరిజన గ్రామంలో పాలక రాహుల్‌కు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా రూ.10 లక్షలతో మంజూరైన ఫిష్‌ ఆంధ్ర డెయిరీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా గిరిజన ప్రాంతంలో ఫిష్‌ ఆంధ్ర డెయిరీ మంజూరైందని తెలిపారు. దీనికి ప్రభుత్వం మత్స్య శాఖ ద్వారా 60 శాతం సబ్సిడీ వస్తుందన్నారు. మూడేళ్ల తర్వాత ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ ద్వారా 30 శాతం బ్యాంకు నుంచి సబ్సిడీ విడుదల అవుతుందని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి వేముల తిరుపతయ్య, మత్స్యశాఖ డివిజనల్‌ అభివృద్ధి అధికారి డి.గోపీకృష్ణ, డిఆర్‌పి లక్ష్మి, మత్స్య శాఖ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మురళీకృష్ణ, ఎంపిపి శెట్టి పద్మావతి, జెడ్‌పిటిసి జి.సుజాత, వైసిపి వాణిజ్య విభాగాల జిల్లా అధ్యక్షులు అంధవరపు కోటేశ్వరరావు, మేజర్‌ పంచాయతీ ఉప సర్పంచ్‌ షేక్‌ ఆదిల్‌, ఎంపిటిసిలు, సర్పంచులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️