ఫ్రూట్‌ మార్కెట్‌ను తరలించొద్దు

దాచేపల్లి: ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఫ్రూట్‌ మార్కెట్‌ను దుర్గంధం వెదజల్లే నాగులేరు పక్కకు తరలించొద్దని దాచేపల్లి తోపుడు బండ్ల కార్మికులు (సిఐటియు) అన్నారు. స్థానికగా శుక్రవారం సమావేశం నిర్వహించారు. దాచేపల్లి బస్టాండ్‌ లో కనీసం మరుగుదొడ్డి కూడా లేదని బస్సు దిగిన ప్రయాణికులు అందరూ కూడా నాగులేరు పక్కనే మూత్ర విసర్జన చేస్తారని, మల విసర్జన నిమిత్తం వచ్చే వారు ఉంటారని అన్నారు. ఇటువంటి అపరిశుభ్రమైన దుర్గంధం వెదజల్లే ప్రదేశంలో రోజుకి 14 గంటలు కార్మికులు నించోని వ్యాపారం చేస్తే వారి ఆరోగ్యాలు దెబ్బ తింటుందని అన్నారు. కొనుగోలు చేసేందుకు ప్రజలు కూడా రారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తగ్గి పూర్తి సౌకర్యాలు కల్పించిన తర్వాతే తరలించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చకపోతే వచ్చే మంగళవారం నుండి మండలంలో ఎక్కడా పండ్ల వ్యాపా రం జరగ కుండా బంద్‌ ప్రకటించి నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా మస్తాన్‌ మరియు కొప్పుల కృష్ణయ్యను ఎన్నుకున్నారు.

➡️