బకాయిలను తక్షణం చెల్లించాలి : యుటిఎఫ్‌

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని యుటిఎఫ్‌ నాయకులు విమర్శించారు. యుటిఎఫ్‌ పోరు బాటలో భాగంగా ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తున్నందుకు ఆందోళన వ్యక్తం చేస్తూ శుక్రవారం అంబేద్కర్‌ విగ్రహం వద్ద యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో నోటికి నల్ల రిబ్బన్‌ ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్‌ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ఉద్యోగులపై ప్రేమ కురిపించిన జగన్‌ మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపా ధ్యాయ, ఉద్యోగుల, పెన్షనర్ల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శి స్తున్నారని పేర్కొన్నారు. తమకు చెల్లించాల్సిన బకాయిల గురించి అడిగితే ఉద్యమాలపై నిర్భందం ప్రయోగి స్తున్నా రన్నారు. ఉద్యోగులకు న్యాయంగా చెల్లించాల్సిన బకాయిలను దాటవేశే వైఖరి అవలంభిస్తున్నారని విమ ర్శించారు. ఉద్యోగుల సొమ్మును ప్రభుత్వ అవసరాలకు వాడుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. డిఎ, పిఆర్‌సి, సరెండర్‌ లీవ్‌, ఎపిజిఎల్‌ఐ, మెడికల్‌ రీయిం బర్స్‌మెంట్‌, పదవ తరగతి పరీక్షల రెమ్యునరేషన్‌, సిపిఎస్‌ మ్యాచింగ్‌ గ్రాంట్‌ మొదలైన బకాయిలు దాదాపు రూ.18 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ చెంగల్‌రాజు, జిల్లా కార్యదర్శులు వెంకట సుబ్బయ్య, రమణ మూర్తి, రెడ్డెమ్మ, జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యులు రమణయ్య, విశ్రాంత యుటిఎఫ్‌ నాయకులు ప్రతాప్‌, సుబ్బరాజు, భాస్కర్‌ రాజు, సుబ్బయ్య, రాజంపేట, పెనగలూరు, నందలూరు, పుల్లంపేట మండలాల నాయకులు పాల్గొన్నారు. రాయచోటి :బకాయిలను చెల్లించక పోవడం ఎలాంటి న్యాయమో ప్రభుత్వ పెద్దలు చెప్పాలని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ జాబీర్‌ పేర్కొన్నారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చిన ప్పటికీ ఆయా బకాయిలను చెల్లించకపోవడం తీవ్ర అన్యాయం చేసినట్లుగా తెలిపారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలనిమ తెలిపారు. 12వ పిఆర్‌సి కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఆ కమిటీ విధి విధానాలు వెల్లడించకపోవడం ఉద్యోగ ఉపాధ్యాయులను మభ్యపెట్ట డమేనని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యుడు ప్రసాద్‌, రాయచోటి మండల అధ్యక్షుడు హఫీజుల్లా, సహాధ్యక్షులు రఫీ, చిన్నమండెం మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి సహాధ్యక్షుడు కిఫాయ తుల్లా, రెడ్డిముని సుధాకర్‌, సీనియర్‌ నాయకులు ఉమా శంకర్‌, వీరబల్లి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగార్జున, అమీనుల్లా పాల్గొన్నారు. మదనపల్లి: స్థానిక బెంగళూరు రోడ్‌లోని తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నోటికి నళ్ల రుబ్బన్లు కట్టుకుని నిరసన దీక్ష చేపట్టినట్లు యుటిఎఫ్‌ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవా ధ్యక్షులు సుధాకర్‌ నాయుడు, సహ అధ్యక్షులు హేమలత, జిల్లా కార్యదర్శలు పురం వెంకటరమణ, భాస్కరరెడ్డి, ఆది నారాయణ, డివిజన్‌ కన్వీనర్‌ ఎగవింటి సుధాకర్‌ పాల్గొన్నారు. పీలేరు: ప్రభుత్వం దిగివచ్చి పెండింగులోని ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆర్థిక బకాయీలను చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామని యుటిఎఫ్‌ నాయకులు హెచ్చరించారు. అంబేద్కర్‌ విగ్రహం ముందు వారు మూతికి నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ సదాశివరెడ్డి, జిల్లా ట్రెజరర్‌ చంద్రశేఖర్‌, ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ గౌరవాధ్యక్షులు రాధాకృష్ణ, సిపిఎస్‌ కన్వీనర్‌ రమేష్‌ రెడ్డి, వెంకటరమణ దేవేందర్‌ రెడ్డి, విజయకుమార్‌, అనిరుద్రయ్య పాల్గొన్నారు.

➡️