బాధితులకు ఎంఎల్‌ఎ పరామర్శ

Dec 25,2023 21:17
ఫొటో : బాధితులను పరామర్శిస్తున్న ఎంఎల్‌ఎ ప్రతాప్‌కుమార్‌రెడ్డి

ఫొటో : బాధితులను పరామర్శిస్తున్న ఎంఎల్‌ఎ ప్రతాప్‌కుమార్‌రెడ్డి
బాధితులకు ఎంఎల్‌ఎ పరామర్శ
ప్రజాశక్తి-కావలి : ముసునూరు గ్రామంలో జరిగిన కత్తి దాడి ఘటనలో నారాయణ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులు నాగిశెట్టి శ్రీనివాసులు, మామిడాల సుధాకర్‌ రావు, నాగిశెట్టి పవన్‌లను ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి సోమవారం పరామర్శించారు. నారాయణ హాస్పిటల్‌లో కత్తి దాడిలో గాయపడ్డ బాధితుల ఆరోగ్య రీత్యా పరిస్థితిపై వారి యోగ క్షేమాలు గురించి స్వయంగా డాక్టర్లను ఆరా తీశారు. ఆపరేషన్‌ జరిగిన బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వారికి ఎటువంటి ప్రాణహాని లేదని, త్వరలోనే కోలుకుంటారని, ఏ అవసరం వచ్చినా అండగా తానుంటానని ఎంఎల్‌ఎ బాధితుల కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. అయనవెంట మండలి.కృష్ణారావు, సుంకే.మాల్యాద్రి, వైసిపి పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి.శివకుమార్‌ రెడ్డి, చెన్ను.ప్రసాద్‌ రెడ్డి, మాజీ ఆప్కాబ్‌ చైర్మన్‌ కొండూరు అనిల్‌ బాబు, తదితరులు పాల్గొన్నారు.

➡️