బాధితులకు రెడ్‌ క్రాస్‌ సొసైటీ చేయూత

 

హైజనిక్‌ కిట్లు, వంటసామగ్రి కిట్లు అందజేస్తున్న సభ్యులు

ప్రజాశక్తి- ముమ్మిడివరం

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి రెడ్‌ క్రాస్‌ సొసైటీ అన్ని విధాల అండగా ఉంటుంద జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ కోరుకొండ సత్యనారాయణ (ఢిల్లీ నారాయణ) పేర్కొన్నారు. నగర పంచాయతీ పరిధిలోని మార్కెట్‌ ప్రాంతంలో మంద బయలులో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబం మోర్త ఆదిలక్ష్మి కుటుంబానికి మంగళవారం నగర పంచాయతీ చైర్మన్‌ కమిడీ ప్రవీణ్‌ కుమార్‌ మరియు జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ కోరుకొండ సత్యనారాయణ చేతులు మీదుగా హైజనిక్‌కిట్స్‌, వంట సామగ్రి, టార్పాలిన్స్‌, దుప్పట్లు, బియ్యం, కూరగాయలు మరియు కిరాణా సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ ఛైర్మన్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ ఢిల్లీ నారాయణ సూచనల మేరకు జిల్లా కలెక్టర్‌ హిమాన్సు శుక్ల ఆదేశాలతో బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందజేశారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ సభ్యులు పెయ్యిల చిట్టి బాబు కన్నిడి వెంకటేశ్వరరావు, ఎం.శివ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️