బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి

మాట్లాడుతున్న ఐద్వా నాయకులు రంగమ్మ

ప్రజాశక్తి-చింతూరు

మండలంలోని మామిళ్ళగూడెం గ్రామంలో అత్యాచారం, హత్యకు గురైన శ్యామల స్వప్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి పద్మ జిల్లా ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు ముర్రం రంగమ్మ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఐద్వా నాయకులు సోమవారం స్వప్న కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రంగమ్మ మాట్లాడుతూ 2019 జులై 11న తేదీన శ్యామల స్వప్నపై ముచిక లక్ష్మయ్య, మిడియం రమేష్‌ ఇద్దరు దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారని తెలిపారు. దీనిపై జిల్లా వ్యాప్తంగా నాడు ఐద్వా ఆందోళనలు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో నిందితున్ని అరెస్ట్‌ చేసి జైలుకు పంపించడం జరిగిందని, ప్రథమ ముద్దాయి ముచిక లక్ష్మయ్యకు 20 సంవత్సరాలు, మిడియం రమేష్‌కు 8 సంవత్సరాలు జైలు శిక్ష పడిందని చెప్పారు. అత్యాచార సంఘటనపై ఛార్జిషీట్‌ నమోదైన వెంటనే బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు నష్ట పరిహారం అందజేయాల్సి ఉండగా, నేటి వరకు ఎటువంటి పరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బాధిత కుటుంబానికి రూ.20 లక్షలు సాయం చేయాలని, భూమి, ఉండటానికి ఇల్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు జయ, రాములమ్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️