బాధిత కుటుంబాలకు పరామర్శ

ప్రజాశక్తి-చీమకుర్తి : టిడిపి సీనియర్‌ నాయకుడు కాట్రగడ్డ రమణయ్య సోదరుడు కాట్రగడ్డ వెంకటేశ్వర్లు(70) అనారోగ్యంతో మృతి చెందాడు. మాజీ ఎమ్మెల్యే బిఎన్‌. విజయకుమార్‌, టిడిపి నాయకులు సోమవారం వెంకటేశ్వర్లు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరా మర్శించారు. టిడిపి సీనియర్‌ నాయకుడు, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కందిమళ్ళ గంగాధరరావు తండ్రి వెంటేశ్వర్లు ఇటీవల మృతి చెందారు. అందులో భాగంగా విజయకుమార్‌ గంగాధరరావును రామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో టిడిపి సీనియర్‌ నాయకులు మన్నం ప్రసాదు, పూనాటి వెంకటరావు, యడ్లపల్లి రామబ్రహ్మం, గొల్లపూడి కోటేశ్వరరావు, .చెన్నయ్య, ఉన్నం సుబ్బారావు, మోహన్‌, నాగేశ్వరరావు, వై.శ్రీను, కోటయ్య, ఎస్‌.ఆంజనేయులు పాల్గొన్నారు.

➡️