బాబు ఆశీస్సులతో విజయం సాధిస్తా..

Feb 2,2024 21:46
ఫొటో : మాట్లాడుతున్న మాజీ జెడ్‌పి చైర్మన్‌ చెంచల బాబు యాదవ్‌

ఫొటో : మాట్లాడుతున్న మాజీ జెడ్‌పి చైర్మన్‌ చెంచల బాబు యాదవ్‌
బాబు ఆశీస్సులతో విజయం సాధిస్తా..
ప్రజాశక్తి-ఉదయగిరి : టిడిపి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఉంటే నెల్లూరు జిల్లా పార్లమెంటు అభ్యర్థిగా విజయం సాధిస్తామని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మాజీ జెడ్‌పి చైర్మన్‌ చెంచల బాబు యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక తన అతిథి భవనంలో జయహో బిసి గర్జన సభను నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షులు చింతనబోయిన బయన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభకు అధ్యక్షత మతకాల శ్రీను నిర్వహించి సమావేశంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సభ ముఖ్య ఉద్దేశం టిడిపిలో బిసిలకు వేసిన పెద్దపీటను ప్రస్తుత వైసిపి ప్రభుత్వంలో అందుతున్న దుర్మార్గ అరాచక పాలన వివరించేందుకు ఈ సమావేశం నిర్వహించామన్నారు. నారా చంద్రబాబును నెల్లూరు జిల్లా పార్లమెంటు పరిధిలో ఏడు అగ్రవర్ణాలు ఉన్నారని పార్లమెంటు అభ్యర్థిగా అధిక ఓట్లు ఉన్న బిసిగా నన్ను ఎంపిక చేయాలని అభ్యర్థించాలని ఆయన ఆశీస్సులు ఉంటే జిల్లాలో బిసిలు తరఫున ఎంపి అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం తమ బాధ్యత అన్నారు. తన తండ్రి నియోజకవర్గ మాజీ ఎంఎల్‌ఎగా చపరిచితులని ఐదు సంవత్సరాలు జెడ్‌పి చైర్మన్‌గా అవినీతి మరకలు లేని బిసిగా తానేనని గర్వంగా చెప్పుకుంటున్నాని, 2024లో నియోజకవర్గ ఎంఎల్‌ఎగా మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబును గెలుపిచ్చుకునే బాధ్యత ప్రతి బిసి నాయకులు కార్యకర్తలపై ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో టిటిడి మూడుసార్లు బిసిలకు ఇచ్చారని వైసిపి ప్రభుత్వం బిసిలపై కపటి ప్రేమ చూపుతూ బిసిలను నమ్మక ద్రోహం చేస్తుందని 2024లో వచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని ప్రతి బిసి కార్యకర్త గుర్తించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం రాష్ట్ర జిల్లా బిసి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చినప్పుడు నుండి బిసిలపై జరుగుతున్న అన్యాయాలు అక్రమ అరెస్టులు ఎదుర్కొనాలంటే బిసిలకు అండగా నిలబడే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలన్నారు. 5వేల కేసులు కార్యకర్తలపై వైసిపి ప్రభుత్వం పెట్టిందని పాల్గొని అనేక విధాలుగా సంఘటనలన్నింటినీ గుర్తుంచుకోవాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం 30వేల పథకాలను తీసుకొస్తే జగన్‌ వాటిని రద్దు చేశారన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు రియాజ్‌, నియోజకవర్గ బిసి నాయకులు రవీంద్రబాబు, శ్రీనివాసులు, సుభాన్‌ బాషా, హరికృష్ణ, భాస్కర్‌, వాసు, రేవతి, నరసింహారాజు, తదితర బిసి నాయకులు పాల్గొన్నారు.

➡️