బాల నేరస్తులకు న్యాయ సాయం : జడ్జి

ప్రజాశక్తి, – కడప యువతను పునరుద్ధరించడం, జైలులో ఉన్న బాల నేరస్తులను గుర్తించి న్యాయ సహాయం అందించడమే పాన్‌ ఇండియా ప్రచారం-2024 ముఖ్య ఉద్దేశమని సీనియర్‌ సివిల్‌ జడ్జి బాబా ఫక్రుద్దీన్‌ అన్నారు. ఆదివారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో పురుషుల కేంద్రకారాగారంలో పాన్‌ ఇండియా ప్రచారం -2024 లో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ పాన్‌ ఇండియా ప్రచారం 2024 లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ న్యాయవాదులు, ప్యానల్‌ న్యాయవాదులు, పారా లీగల్‌ వాలంటీర్లతో టీం లను ఏర్పాటు చేసి పురుషుల కేంద్ర కాగారం , మహిళా కేంద్ర కారాగారంలో ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ప్రచార సమయంలో జైళ్లలో ఉన్న బాల నేరస్తులను గుర్తించడం వారికి తగు న్యాయ సహాయం అందిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, జమ్మలమడుగు, బద్వేల్‌, పులివెందుల, కమలాపురం జైలుల నందు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పురుషుల కేంద్రకారాగారం సూపరిండెంటెంట్‌ ప్రకాష్‌, మహిళల కేంద్ర కారాగార సూపరిండెంట్‌ కష్ణవేణి, డిస్టిక్‌ సబ్‌ జైల్‌ ఆఫీసర్‌ ఎం. హుస్సేన్‌ రెడ్డి, డిప్యూటీ సూపరిండెంట్‌ ఏ.సాంబశివరావు, చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ హరి బాబు, డిప్యూటీ చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ శాంత, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ మనోహర్‌, బార్‌ అసోసియేషన్‌ సెక్రటరీ కెనడి, పానెల్‌ న్యాయవాదులు, పారా లీగల్‌ వాలంటరీలు, ఖైదీలు పాల్గొన్నారు.

➡️