బిటి రహదారి ప్రారంభం

Nov 30,2023 21:10

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : మండలంలోని గోచెక్క పంచాయతీ పరిధిలో కొసరివానివలసలో రూ.90లక్షలతో నిర్మించిన బిటి రహదారిని గురువారం స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గంలోని అన్ని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిం చామన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచి ఉదయాన శకుంతల, ఎంపిపి మజ్జి శోభారాణి, జడ్పీటీసీ బలగరేవతమ్మ, వైస్‌ ఎంపీపీలు బి.రవికుమార్‌ సిద్ద జగన్నాథరావు, నాయకులు బొమ్మి రమేష్‌, బలగ నాగేశ్వరరావు, మజ్జి చంద్రశేఖర్‌, గణేష్‌, సుందరరావు పాల్గొన్నారు.

➡️