బిసిల సమస్యల పరిష్కారానికి కృషి

ప్రజాశక్తి – కడప ప్రతినిధిబిసి, దూదేకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దూదేకుల, నూర్‌బాష్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఓతూరి రసూల్‌ సాహెబ్‌ పేర్కొన్నారు. శనివారం కడప నగరంలోని ఐఎంఎ హాలులో బిసి సంక్షేమ సంఘం, దూదేకుల భవన కమిటీ సంయుక్తంగా సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు, దూదేకులకు ఎళ్లవేలా అందు బాటులో ఉంటానని చెప్పారు. ప్రముఖ సంఘ సేవ కులు డాక్టర్‌ నూరీపర్వీన్‌ మాట్లాడుతూ బడుగుల, దూదే కులు పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. అప్పుడే ఉన్నత స్థానాల్ని చేరుకునే అవకాశాలు ఉంటాయని తెలిపారు. విద్యతోపాటు పోరాట, నాయకత్వ లక్షణాల్ని అలవరుచుకోవాలన్నారు. బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు లింగమూర్తి మాట్లాడుతూ దూదేకుల కార్పొ రషన్‌ చైర్మన్‌ రసూల్‌ బిసి భవన్‌ నిర్మాణ సమస్యను ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. విద్యావేత్త నాగూర్‌ మాట్లాడుతూ దూదేకులు విద్యను ఆలంబన చేసుకుని ఎదగాలన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీల్లో గెలుపోట ములను ప్రభావితం చేయగలిగే జనసాంధ్రతను కలిగి ఉన్నారన్నారు. ఒక్కో అసెంబ్లీ పరిధిలో సుమారు 20 వేల మంది జనాభా ఉన్నారని తెలిపారు. డిప్యూటీ సిఎం గైర్హాజరీపై మండిపాటు దూదేకుల, నూర్‌బాషా కార్పొరేషన్‌ చైర్మన్‌ ఓతూరి రసూల్‌ సన్మాన కార్యక్రమానికి డిప్యూటీ సిఎం, మేయర్‌, కమలాపురం ఎమ్మెల్యే హాజరవుతామని హామీనిచ్చి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇది బిసి లను, దూదేకులను అవమానించడమేననే అసహనం వ్యక్త మైంది. హామీనివ్వని పక్షంలో తమదైన పద్ధతిలో సకాలంలో కార్యక్రమాన్ని సకాలంలో నిర్వహించుకునేవారని ప్రస్తావన చేసుకోవడం గమనార్హం. కడప నగరంలోని ఓ సామా జికవర్గ కార్యక్రమానికి హాజరై, తమను నిర్లక్ష్యం చేయ డమేమిటని ప్రశ్నించారు. బిసి సంఘం, దూదేకుల సంఘం నాయకులు శాలువాలను కప్పి భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో దూదేకుల సంఘం జిల్లా సలహాదారులు ఆయిల్‌మిల్‌ ఓబులేసు, టీచర్‌ అజ్మతుల్లా, బిసి సంఘం నాయకులు గోవిందునాగరాజు, కళ్యా సుధాకర్‌, బిసి సంక్షేమ సంఘం నాయకులు, దూదేకుల భవన కమిటీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

➡️