బీచ్‌ కబడ్డీ పోటీలు ప్రారంభం

ప్రజాశక్తి-సంతనూతలపాడు : మండల పరిధిలోని మంగమూరు గ్రామంలో అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీచ్‌ కబడ్డీ పోటీలను వైసిపి అద్దంకి నియోజకవర్గ పరిశీలకులు, ఎఎంసి మాజీ చైర్మన్‌ మారం వెంకారెడ్డి బుధవారం ప్రారంభించారు. తొలుత అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కొండసింగు రాజు, పైడి యుగంధర్‌, కంకణాల గోపికష్ణ , పెయ్యల తిరుపతిస్వామి, కసుకుర్తి శివ, కందుల రామారావు, కసుకుర్తి శ్రీనివాసరావు, కంకణాల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

➡️