బీసీ డిక్లరేషన్‌ హర్షణీయం: డాక్టర్‌ ఉగ్ర

ప్రజాశక్తి-కనిగిరి: బీసీ డిక్లరేషన్‌ ప్రకటించి బీసీ ప్రజానీకంలో కోటి ఆశలు నింపడం హర్షణీయమని కనిగిరి టిడిపి అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. స్థానిక అమరావతి గ్రౌండ్లో బుధవారం బిసి శ్రేణులు చంద్రబాబు ఫేస్‌ మాస్క్‌లు పట్టుకుని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్‌ అమలు చేయడంతోపాటు పెన్షన్‌ను నెలకు రూ.4 వేలకు పెంచే నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన్నారు. జగన్‌ పాలనలో 300 మందికి పైగా బీసీలు క్రూరంగా హత్యకు గురయ్యారని, బీసీలపై దాడులు, దౌర్జన్యాల నుంచి రక్షణ కోసం ‘ప్రత్యేక రక్షణ చట్టం’ తీసుకొస్తామని అన్నారు. సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి హక్కులు కాపాడుతామని అన్నారు. బీసీ సబ్‌ ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రూ.75 వేల కోట్ల సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్లించిందని, అధికారంలోకి వచ్చాక బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులు బీసీల కోసమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌ను వైసీపీ ప్రభుత్వం 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించి, 16,800 పదవులు దూరం చేశారని, అధికారంలోకి వచ్చాక 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని అన్నారు. చట్టసభల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి టిడిపితోనే సాధ్యమన్నా రు. ఈ కార్యక్రమంలో బిసి టౌన్‌ అధ్యక్షులు చింతలపూడి తిరుపాలు, కనిగిరి పట్టణ టిడిపి అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాసరెడ్డి, టిడిపి నాయకులు షేక్‌ ఫిరోజ్‌, షేక్‌ అహ్మద్‌, గుడిపాటి ఖాదర్‌, ఈదర రవికుమార్‌, ఆర్‌వి నారాయణ, వివిఆర్‌ మనోహర్‌రావు, తమ్మినేని వెంకట్‌రెడ్డి, చిలకపాటి లక్ష్మయ్య, శివ కాశయ్య, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.టిడిపితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: డాక్టర్‌ ఉగ్ర సిఎస్‌ పురం: రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కనిగిరి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. వైసీపీ పని అయిపోయిందని, అనేక మంది ఇప్పటికే టిడిపిలోకి వలసలు వస్తున్నారని అన్నారు. మండలంలోని చెన్నపునాయునిపల్లి గ్రామానికి చెందిన 31 కుటుంబాల వారు వైసీపీని వీడి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ తోడేటి పెద్దఅల్లూరయ్య ఆధ్వర్యంలో కనిగిరి అమరావతి గ్రౌండ్‌లో వారందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామానికి చెందిన యనమల తిరుపతయ్య, చింతలపూడి వెంకటయ్య, మాజీ సర్పంచ్‌ డేగల జానకి రాములు, విట్టపు నాగేంద్ర, వంకాయల చిన్నతిరుపతయ్య, యనమల రఘు, మూడమంచు తిరుపతయ్య, నేదురుపల్లి రోశయ్య, గండి తిరుమలయ్య, గండిపోగు బాలశౌరి, దండబోయిన తిరుపతయ్య, చింతలపూడి వెంకటరమణ, కోన శ్రీను, మూడమంచు నడిపితిరుపాలుతో కలిపి మొత్తం 31 కుటుంబాల వారు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు బొమ్మనబోయిన వెంగయ్య, టిడిపి సీనియర్‌ నాయకులు నాగిశెట్టి చినమాలకొండయ్య, చిన్నపనాయనపల్లి గ్రామ టిడిపి అధ్యక్షులు దేశముకుల నారాయణ, తోడేటి గోపి, జక్క నరసింహారావు, జి వెంకటరామరాజు, దాసరి మల్లికార్జున, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, షేక్‌ ఖాదర్‌వలి, చిట్టిబోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

➡️