‘బూచేపల్లి’కి అభిమానుల శుభాకాంక్షలు

ప్రజాశక్తి-దర్శి: జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి దర్శిలోని వారి గృహానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. నూతన సంవత్సర సందర్భంగా దర్శిలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో కేక్‌ కట్‌ చేసి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా వైసీపీ నాయకులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి వారిని గజమాలతో ఘనంగా సన్మానించారు. మరొక మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు నారపుశెట్టి పాపారావు స్వగృహంలో కూడా టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జనసేన నాయకులు గరికపాటి వెంకట్‌కు తమ కార్యాలయంలో అభిమానులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు గజమాలతో సత్కరించారు. దర్శి డీఎస్పీ అశోక్‌వర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో బూచేపల్లి నివాసంలో పోలీసులు కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు వెన్నపూస వెంకటరెడ్డి, తూము సుబ్బారెడ్డితో పాటు షేక్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ఎం బాషా, ఎంపీపీలు గోళ్లపాటి సుధారాణి, ఉష, జడ్పీటీసీలు నుసుం నాగిరెడ్డి, రత్నంరాజు, మాజీ ఎంపీపీలు ఇత్తడి దేవదానం, మధుసూదన్‌రెడ్డి, రామిరెడ్డి, వీరగంధం కోటయ్య, మోషే, శ్రీనివాసరెడ్డి, కొల్లా భాస్కర్‌, నరసింహారెడ్డి, ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. అదే విధంగా టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చిట్టే వెంకటేశ్వర్లు, కూరపాటి శ్రీను, బొమ్మిరెడ్డి ఓబుల్‌రెడ్డి, శివకోటేశ్వరరావు, పలువురు జనసేన నాయకులు ఉన్నారు. అదే విధంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి శిద్దా రాఘవరావును కలిసేందుకు ఒంగోలుకు తరలివెళ్లారు.

➡️