బెదిరేదిలే…తగ్గేదిలే..!కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె

Dec 15,2023 21:42
కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్

బెదిరేదిలే…తగ్గేదిలే..!కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మెప్రజాశక్తి -తిరుపతి టౌన్‌, యంత్రాంగంఅంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం పాత మున్సిపల్‌ కార్యాలయం ముందు రాజీవ్‌ గాంధీ విగ్రహం సర్కిల్‌ చుట్టూ మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కే వేణుగోపాల్‌ మాట్లాడుతూ అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మెలోకి దిగితే వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే నిన్నటి రోజున అంగన్వాడీలు ఒళ్ళు కొవ్వెక్కి నిరసన తెలిపారన్న మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. అంగన్వాడీలకు క్షమాపణ చెప్పాలన్నారు. సిపిఎం తిరుపతి నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, కాంగ్రెస్‌ పార్టీ మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్‌ మద్దతు ప్రకటించారు. నాయకులు పి.బుజ్జి, ఎం.జయంతి, రమేష్‌ పాల్గొన్నారు. ర గూడూరులో టిడిపి రాష్ట్ర మహిలా కార్యదర్శి గుండాల లీలావతి, పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణిరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి బత్తిల ప్రమీల తదితరులు సంఘీభావం ప్రకటించారని అంగన్‌వాడీ అధ్యక్షురాలు ఎ.ఇంద్రావతి పేర్కొన్నారు. ర జీడీనెల్లూరు టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి డాక్టర్‌ థామస్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలకు సంఘీభావంగా శుక్రవారం భోజన ఏర్పాటు చేశారు. కార్వేటినగరం, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం మండలాల నుంచి దాదాపు 350 మంది అంగన్‌వాడీలు పాల్గొన్నారని తెలిపారు. రబిఎన్‌ కండ్రిగలో సిపిఐ జిల్లాకార్యవర్గ సభ్యులు కత్తిరవి, టిడిపి మండల కార్యదర్శి సుధాకర్‌నాయుడు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రపిచ్చాటూరులో నల్లచీరలు కట్టుకుని అంగన్‌వాడీలు భారీ ర్యాలీ నిర్వహించారు. అంగన్‌వాడీ సెంటర్ల తాళాలు పగలగొడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నాయకులు ఇంద్రాణి, రాజేశ్వరి హెచ్చరించారు. గుర్రాలతో తొక్కించినపుడే బెదరలేదన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి జనార్ధన్‌, టిడిపి నేత డి.ఇలంగోవన్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. ర వరదయ్యపాలెంలో సిఐటియు నాయకులు రమేష్‌ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది, వలంటీర్ల సాయంతో అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహించాలని కలెక్టర్‌ తీసుకున్న నిర్ణయం అధికార అహంకారాన్ని చూపిస్తోందన్నారు. ర శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మ, ఆమె కోడలు రిషితారెడ్డి, జనసేన ఇన్‌ఛార్జి వినుత కోటా సంఘీభావం ప్రకటించారు. అక్కచెల్లెమ్మలను జగన్మోహన్‌రెడ్డి రోడ్డున పడేశారన్నారు. ర నగరిలో జనసేన సమన్వయకర్త మెరుపుల మహేష్‌, కాంగ్రెస్‌ నాయకులు కోదండయ్య, కేశవులు, సిపిఎం, సిపిఐ నాయకులు వెంకటేష్‌, మహేష్‌ సంఘీభావం తెలిపారని యూనియన్‌ నాయకులు ధనకోటి మునెమ్మ తెలిపారు. ర రేణిగుంటలో నల్లచీరలతో నిరసన తెలుపుతూ అంబేద్కర్‌ విగ్రహానికి, ఎంపిడిఒ, తహశీల్దార్‌కు వినతిపత్రాలు ఇచ్చారు. అంగన్‌వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి తెరవడాన్ని దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. టిడిపి మండల అధ్యక్షులు మునిచంద్రరెడ్డి, సిఐటియు నాయకులు కె.హరినాథ్‌ సంఘీభావం తెలిపారు. టిడిపి నాయకులు 200 మందికి భోజనాలు పెట్టి మద్దతు ప్రకటించారు. ర పలమనేరులో టిడిపి అధ్యక్షులు సోమశేఖర్‌గౌడ్‌ సంఘీభావం ప్రకటించారు.గిరిధర్‌, విఆర్‌జ్యోతి, శాంతి, ఆర్‌.వెంకటరత్నమ్మలు ప్రసంగించారు. ర వి.కోటలో ఐద్వా జిల్లా కార్యదర్శి భువనేశ్వరి సంఘీభావం క్రటించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి, జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. స్థానికుల నుంచి మద్దతు లభించింది. ఎంఆర్‌ఒ కార్యాలయం వద్ద పాటలతో నిరసన కొనసాగించారు. ర బంగారుపాళ్యంలో జానపద కళాకారుల రాష్ట్ర కార్యదర్శి బంగారు మురళి, సిఐటియు నాయకులు సురేంద్ర మద్దతు తెలిపారు. – కుప్పంలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎంఎల్‌సి కంచర్ల శ్రీకాంత్‌ మద్దతు తెలిపారు. శాంతిపురంలో మాజీ ఎంఎల్‌సి గౌనివారి శ్రీనివాసులు పాల్గొన్నారు. – సూళ్లూరుపేటలో లారీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సత్యం, రమేష్‌, జాలయ్య, సిఐటియు నాయకులు పద్మనాభయ్య, టిడిపి నాయకులు బుద్ది విజయలక్ష్మి, జనసేన నాయకులు ప్రవీణ్‌ సంఘీభావం ప్రకటించారు. ర చంద్రగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆంజనేయస్వామి విగ్రహం నుంచి ఎంఆర్‌ఒ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌.వాణిశ్రీ, సిఐటియు నాయకులు జయచంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను భగం చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తుందన్నారు. ర నాయుడుపేటలో మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌ జిల్లా కార్యదర్శి కె.విజయమ్మ, యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు రాజశేఖర్‌రెడ్డి సంఘీభావం తెలిపారని ప్రాజెక్టు కార్యదర్శి శ్యామలమ్మ, నాయకులు శివకవి ముకుంద తెలిపారు. నల్లగుడ్డలతో నిరసన చిత్తూరు అర్బన్‌ : అంగన్‌వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడాన్ని నిరసిస్తూ నల్లగుడ్డలతో నిరసన తెలిపారు. అంగన్‌వాడీలు న్యాయమైన సమస్యల పరిష్కారానికి నాలుగురోజులుగా సమ్మె చేస్తుంటే అర్ధరాత్రిలో సెంటర్ల తాళాలు పగలగొట్టడాన్ని నిరసిస్తూ చిత్తూరు ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ప్రేమ, ఎఐటియుసి గౌరవాధ్యక్షులు ఎస్‌.నాగరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.చైతన్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చర్చల పేరుతో సమస్యలు పరిష్కారం చేయకుండా నానబెడుతోందన్నారు. దీనికి మూల్యంచెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి, సిఐటియు నాయకులు సుజని ,బుజ్జి ఏఐటీయూసీ నాయకులు ప్రభావతి లతోపాటు జ్యోతి, చంద్ర రమాదేవి జరిగింది.

➡️