భగత్‌సింగ్‌ స్ఫూర్తితో పోరాటం

Mar 23,2024 23:44

గుంటూరులో భగత్‌సింగ్‌ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా :
దేశంలో కుల, మతతత్వాలకు వ్యతిరేకంగా భగత్‌సింగ్‌ స్ఫూర్తితో ఐక్యంగా ఉద్యమించాలని, వామపక్ష వాదులే భగత్‌సింగ్‌ వారసులని సిపిఎం గుంటూరు, పల్నాడు జిల్లాల కార్యదర్శులు పాశం రామారావు, గుంటూరు విజరుకుమార్‌ అన్నారు. శనివారం భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ 93వ వర్ధంతి సందర్భంగా రెండు జిల్లాల్లోని పలుచోట్ల సిపిఎం, రైతు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సభలు నిర్వహించారు. గుంటూరులోని సిపిఎం కార్యాలయంలో భగత్‌సింగ్‌ చిత్రపటానికి సిపిఎం సీనియర్‌ నాయకులు ఎమ్‌డి అక్బర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. రామారావు మాట్లాడుతూ బ్రిటీష్‌ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించి, 23 ఏళ్ల వయస్సులోనే దేశ స్వాతంత్య్రం కోసం భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ ఉరికంబం ఎక్కి ప్రాణాలర్పించారన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌, ధరలు పెరగడమేగాక, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా, లౌకికతత్వానికి, సమాఖ్య స్పూర్తికి వ్యతిరేకంగా మతతత్వాతన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య విభజన రేఖను సృష్టిస్తోందని విమర్శించారు. సిఎఎ పేరుతో దేశంలోని ముస్లిమ్‌ మైనార్టీల పట్ల వివక్ష చూపుతోందేని, కేంద్ర ప్రభుత్వం తన పరిధిలో వున్న రాజ్యాంగ సంస్థలకు వినియోగించుకుని ప్రతిపక్ష నాయకులు, ఉద్యమకారులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తోందని అన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్రానికి సాగిలపడటం దుర్మార్గమన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో కలిసి ఎన్నికల్లో పోటీచేయడం సరికాదని, ప్రజలు వీరికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు, నాయకులు ఎల్‌.అరుణ, బి.శ్రీనివాసరావు, కె.నాగేశ్వరరావు, వై.కష్ణకాంత్‌, ఎం.కిరణ్‌, ఎస్‌.పద్మ, జి.వెంకట్రావు, వై.కృష్ణ, కె.సుధీర్‌, ఎస్‌.కె.ఖాశింషహీద్‌ పాల్గొన్నారు.

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో నాయకుల నివాళి

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కోటప్పకొండ రోడ్డులోని సిపిఎం కార్యాలయంలో సభకు సిఐటియు నాయకులు సయ్యద్‌ రబ్బాని అధ్యక్షత వహించగా విజరుకుమార్‌ మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, బిజెపి మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా యువత ఉద్యమించాలన్నారు. భగత్‌ సింగ్‌ కలలుగన్న భారతదేశం నిర్మాణం కావాలంటే కార్పొరేట్‌, పెట్టుబడిదారీ విధానానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహిస్తూ మతం పేరుతో ప్రజలను ఐక్యం కాకుండా రెచ్చగొడుతోందని, మరోవైపు దేశాన్ని దోపిడీదారుల చేతుల్లో పెడుతోందని మండిపడ్డారు. దేశ స్వావలంబన కోసం, ఫెడరల్‌ వ్యవస్థను కాపాడుకునేందుకు, విద్య, ఉపాధి అవకాశాల కోసం, రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు భగత్‌సింగ్‌ స్ఫూర్తితో ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో పల్నాడు బాలోత్సవాల కార్యదర్శి కె.కోటేశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయనాయక్‌, మండల అధ్యక్షులు షేక్‌ సిలార్‌ మసూద్‌, పల్నాడు విజ్ఞాన కేంద్రం కార్యనిర్వాహక కన్వీనర్‌ షేక్‌ మస్తాన్‌వలి, పిడిఎం జిల్లా అధ్యక్షులు మస్తాన్‌వలి, శ్రామిక మహిళ జిల్లా సమన్వయ కమిటీ కన్వీనర్‌ డి.శివకుమారి, నాయకులు షేక్‌ ఫాతిమా, విజయలక్ష్మి, జన విజ్ఞాన వేదిక నాయకులు సుభాష్‌ చంద్రబోస్‌, ఎఐటియుసి నాయకులు యు.రంగయ్య, కుల నిర్ములన పోరాట సంఘం నాయకులు ఎన్‌.కృష్ణ, ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకులు కె.ఏడుకొండలు, కౌలురైతు సంఘం నర్సరావుపేట మండల కార్యదర్శి కె.ఆంజనేయులు, అవాజ్‌ నాయకులు హుస్సేన్‌, సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ముస్లిం మైనారిటీ జేఏసీ కన్వీనర్‌ జిలాని మాలిక్‌, కె.స్వరూప్‌, శాంతయ్య, ఖాసీం పాల్గొన్నారు.

➡️