భవిష్యత్తు కోసం టిడిపి గెలుపు : జగదీశ్వరి

Mar 14,2024 21:46

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : భావితరాల భవిష్యత్తు కోసం వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని కురుపాం నియోజకవర్గం టిడిపి అభ్యర్థి తోయక జగదీశ్వరి కోరారు. మండలంలోని మూల బిన్నిడి, చాపరాయి బిన్నిడి గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసిపి పాలనలో ప్రజలకు కష్టాలే మిగిలాయన్నారు. రాక్షస పాలనకు చమర గీతం పాడి రానున్న ఎన్నికల్లో టిడిపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. మూల బిన్నిడిలో 70 కుటుంబాలు, చాపరాయి బిన్నిడిలో 50 కుటుంబాలు టిడిపిలోకి చేరాయి. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు పాడి సుదర్శన్‌రావు, క్లస్టర్‌ ఇంచార్జి కె.దాసు, యూనిట్‌ ఇన్‌ఛార్జి ధర్మా, మండల నాయకులు కడ్రక కళావతి, అనిల్‌, బలరాం, రామారావు తదితరులు ఉన్నారు. సాలూరు రూరల్‌ : మండలంలోని నార్లవలస పంచాయతీ పరిధిలోని మారాయిపాడు, చినమారయ్యపాడు, నక్కడవలస, తాడిలోవలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో టిడిపి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యాన గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీ ఇంటి ఆడబిడ్డగా ఈ ఒక్క అవకాశం ఎమ్మెల్యేగా తనను ఎన్నుకుంటే గిరిజన ప్రాంత గ్రామాలు కొండ శిఖర గ్రామాలు, మైదాన ప్రాంత గ్రామాలను ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నానని తెలిపారు. ఈ గ్రామాల నుండి 30 కుటుంబాలు టిడిపిలో చేరారు. వీరికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు ఆముదాల పరమేష్‌, మాజీ సర్పంచ్‌, గిరిజన నాయకులు బేటుకురి తిరుపతి, లక్ష్మణదొర, లక్ష్మణరావు, శ్యామ్‌, తిరుపతి రావు, రమాదేవి, యుగంధర్‌, కృష్ణ, బాలాజీ, మరిపి సింహాచలం పాల్గొన్నారు. సీతంపేట : శంఖారావంలో భాగంగా సూపర్‌ సిక్స్‌ పథకాలపై టిడిపి నాయకులు పడాల భూదేవి అవగాహనా కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి వెళ్లి కరపత్రాల ద్వారా సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి అవగాహన కల్పించారు. మహాశక్తి, యువగళం, అన్నదాత మొదలైన పథకాలపై వివరించారు. బాబు ష్యూరిటీ -భవిష్యత్‌ గ్యారంటీ గురించి అవగాహన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలలో టిడిపిని గెలిపించి ఈ సంక్షేమ పథకాలు పొందుదామని చెప్పారు. ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి రాక్షస పాలన అంతం చేయడానికి కంకణం కట్టుకోవాలని పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో మండ పంచాయతీ సీనియర్‌ నాయకులు బిగ్‌బాస్‌, సూర్యం, మాజీ ఎంపీటీసీ బిడ్డిక జయలక్ష్మి, వలురౌతు సోమేశ్వరరావు, మాజీ కో ఆప్షన్‌ మెంబెర్‌ మూర మోహనరావు,మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.కురుపాం : మండలంలో రస్తాకుంటుబాయి పంచాయతీలో గల తోటగూడలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ సూపర్‌ సిక్స్‌ పథకాలు ఇంటింటి ప్రచారంలో భాగంగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి టిడిపి శ్రేణులతో కలిసి ప్రచారం చేశారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వీరేష్‌ చంద్ర దేవ్‌, రాష్ట్ర తెలుగు యువత అధికారి ప్రతినిధి కె.రంజిత్‌ కుమార్‌, మండల కన్వీనర్‌ కొండయ్య, టిడిపి నాయకులు వెంకటరావు, వెంపటి భారతి, కె.కళావతి, మాజీ సర్పంచ్‌ మాశయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️