భూ సమస్యలను పరిష్కరించాలి : సిపిఎం

Dec 21,2023 19:01
మాట్లాడుతున్న చండ్ర రాజగోపాల్‌

మాట్లాడుతున్న చండ్ర రాజగోపాల్‌
భూ సమస్యలను పరిష్కరించాలి : సిపిఎం
ప్రజాశక్తి -పొదలకూరు : పొదలకూరు మండలంలో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించాలని, ఖాళీగా పోరంబోకు భూములను పేదలకు పంచి పట్టాలు ఇవ్వాలని సిపిఎం సీనియర్‌ నేత చండ్ర రాజగోపాల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పొదలకూరు సిపిఎం మండల కమిటీ సమావేశం గురువారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం సీనియర్‌ నేత చండ్ర రాజగోపాల్‌, పొదలకూరు ఏరియా పార్టీ ఇన్‌ఛార్జి పెంచల నరసయ్య, మండల కార్యదర్శి బి. మనోహర్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మండలంలోని అనేక గ్రామాల్లో ఉన్నటువంటి భూ సమస్యలపై సుధీర్ఘంగా చర్చించారు. రైతు సమస్యలు, వ్యవసాయ కూలీల సమస్యలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా చండ్ర రాజగోపాల్‌ మాట్లాడుతూ ప్రజలు అనేక రకాల భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. తహశీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగు తున్నారన్నారు. ఒకరి భూమి మరొకరి పేరు మీద ఉందన్నారు. కొందరు కొన్ని ఫేక్‌ పట్టాలు సృష్టించారన్నారు. బైనామాలు రైతుల పేరుతో రిజిస్ట్రేషన్‌ కావడం లేదన్నారు. చుక్కల భూములు రైతులు పేరుతో ఎక్కించడంలో పెండింగ్‌లో ఉందన్నారు. తాటిపర్తి పంచాయతీ పరిధిలోని బత్తులపల్లి పా డులో 134 ఎకరాల మేత పోరంబోకు భూమి ఉందన్నారు. చాలా సంవత్సరాలనుంచి అనేకమంది పేదలు ఆ భూములను తలా ఎకరా తీసుకుని సాగు చేసుకుంటున్నారన్నారు. ఆ ఈ భూమిని మేత పోరంబోకు నుంచి అనాధీనంగా మార్చి సాగు చేసుకుంటున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని సిపిఎం మండల కమిటీ తీర్మానించింది. అంగన్‌వాడీల సమ్మెకు మద్దతు అంగన్‌వాడీల సమ్మెకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని సిపిఎం సీనియర్‌ నేత చండ్ర రాజగోపాల్‌ పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. సుప్రీం కోర్టు తీర్పున నుసరించి కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలన్నారు. నాయకులు దువ్వూరు రంగయ్య, జి.మణి దాసు, పాండు, పెంచలయ్య, ఎల్లయ్య ఉన్నారు.1

➡️