భోగాపురంలో సిఎం ఏరియల్‌ సర్వే

Mar 5,2024 21:25

ప్రజాశక్తి – భోగాపురం : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఏరియల్‌ వ్యూ ద్వారా మంగళవారం పరిశీలించారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన జిఎంఆర్‌ సంస్థ ప్రతినిధులతో కలిసి ఈ పనులను హెలికాప్టర్‌లో నుంచి పరిశీలించారు. ముఖ్యంగా విమానాశ్రయం చుట్టు నిర్మించిన ప్రహరీ గోడ, భూములను చదును చేసి చేస్తున్న నిర్మాణ పనులను పరిశీలించారు. జిఎంఆర్‌ సంస్థ ప్రతినిధులు పనులకు సంబంధించిన వివరాలను ఆయనకు వివరించారు.

➡️