మంత్రికి అంగన్‌వాడీల వినతి

ప్రజాశక్తి-మద్దిపాడు : అంగన్‌వాడీ ఆయాలుగా పనిచేస్తున్న వారికి కార్యకర్తలుగా ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మేరుగ నాగార్జునకు మంగళవారం వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు బంకా సుబ్బారావు మాట్లాడుతూ మద్దిపాడు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని నేలటూరు-1, సంతనూతలపాడు మండలం గుమ్మనంపాడు పంచాయతీ పరిధిలోని బొడ్డపాటివారిపాలెంలో ఆయాలుగా పనిచేస్తున్న డి.ధనలక్ష్మి, జి. గోవిందమ్మకు కార్యకర్తలుగా ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. జీవో 102 ప్రకారం వారికి అర్హత ఉన్న రాజకీయ ఒత్తిళ్లు నేపథ్యంలో ప్రమోషన్లు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో సిఐటియు నాయకులు ఉబ్బా ఆదిలక్ష్మి, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ మద్దిపాడు ప్రాజెక్టు నాయకురాలు ధనలక్ష్మి, అంగన్‌వాడీలు పాల్గొన్నారు. రెండోరోజూ రిలే నిరాహార దీక్షలు అంగన్‌వాడీ ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజు మంగళవారమూ కొనసాగాయి. ఈ దీక్షలను రైతు సంఘం మండల నాయకుడు కనపర్తి సుబ్బారావు ప్రారంభించి సంఘీభావం తెలిపారు.

➡️