మతం విడగొడితే.. సైన్స్‌ కలుపుతుంది..

Feb 12,2024 00:42

ప్రజాశక్తి – చిలకలూరిపేట : మానవులంతా ఒకటేనని, సైన్స్‌ మనందరందరినీ కలుపు తుందనీ, మతాలు మాత్రమే మనలను విడగొడతాయని నెల్లూరు ప్రభుత్వ కళాశాల అసోసి యేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కాలేషా సాహెబ్‌ అన్నారు. మండల కేంద్రమైన యడ్లపాడులోని నారా యణ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ల్లో జనవి జ్ఞాన వేదిక (జెవివి) ఆధ్వర్యంలో రెండ్రోజులుగా నిర్వహించిన రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలు ఆదివారం ముగిశాయి. చివరిరోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ‘హూ ఐ యాం (నేను ఎవరిని?)’ అంశంపై ప్రజెంటేషన్‌ చేశారు. మైటోకాండ్రియాలోని డిఎన్‌ఎ మన తల్లి ఎవరో చెబుతుందని, క్రోమోజోమ్‌లో ఉన్న డిఎన్‌ఎ తల్లి, తండ్రి ఎవరో చెబుతుందని వివరించారు. ప్రస్తుత మున్న ప్రపంచంలోని 750 కోట్ల మందికి మూలాలు ఆఫ్రికాలోనే ఉన్నాయని తెలిపారు. రుజువైన దానిని నమ్మడం, నిత్యజీవితంలో సైన్స్‌ను ఆచరించడం ద్వారా మాత్రమే సమాజం అభ్యున్నతి సాధిస్తుందని అన్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విభాగాల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి విద్యార్థినీ విద్యా ర్థులు పాల్గొని సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయా విభాగాల వారీగా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహు మతులు, ధ్రువపత్రాల ప్రదానంతోపాటు పాల్గొన్న అందరికీ ధ్రువపత్రాలు, జ్ఞాపికలు అందించారు. సంబంరాల నిర్వహణకు సహకరి ంచిన, హాజరైన వారికి జెవివి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ కృతజ్ఞతలు తెలిపారు.

➡️