మత సామరస్యానికి ప్రతీక పెద్దదర్గా

ప్రజాశక్తి – కడప అర్బన్‌ మత సామరస్యానికి ప్రతీకగా, మహిమాన్విత సూఫీగా వెలు గొందుతున్న అమీన్‌పీర్‌ దర్గాను సంద ర్శించడంతో తన జన్మ చరితా ర్థమైందని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహ న్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గురు వారం కడప అమీన్‌పీర్‌ (పెద్దదర్గా) దర్గాను సందర్శించి, ప్రభుత్వ లాంఛ నాలతో పూలచదార్‌ సమర్పించారు. ముందుగా ఆయనకు దర్గా ప్రతినిధులు దర్గా సంప్రదాయ లాంఛనాలతో ఘనంగా స్వాగతం పలికారు. పీఠా ధిపతి ఆరీఫుల్లా హుస్సేని, దర్గా కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ముఖ్య మంత్రికి తలపాగా (పేటా) అలంకరణ చేసి, మెడలోషేలా, ఇలాటి ధరిం పజేశారు. అమీన్‌పీర్‌ దర్గా గ్రంథాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి దర్గా విశిష్టిత, ప్రాశస్త్యాన్ని, చారిత్రక వైభవాన్ని పీఠాధిపతులు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమీన్‌పీర్‌ దర్గాను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆధారిస్తున్న జిల్లా ప్రజలు ఎంతో అదష్టవంతులన్నారు. అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందివ్వగలుగుతున్నామన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివద్ధిలో భాగస్వామ్యం అవుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎస్‌పి సిద్ధార్థ్‌ కౌశల్‌ ఆధ్వర్యంలో దర్గా ప్రాంగణమంతా గట్టి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూల సురేష్‌, ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి.అంజాద్‌ బాషా, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేయర్‌ సురేష్‌ బాబు, కలెక్టర్‌ వి.విజరు రామరాజు, జెసి గణేష్‌ కుమార్‌, నగర పాలక కమిషనర్‌ జి.ఎస్‌.ఎస్‌. ప్రవీణ్‌ చంద్‌, దర్గా మేనేజర్‌ ఎస్‌ఎండీ అలీఖాన్‌, ముజూవర్‌ అమీర్‌, దర్గా కో-ఆర్డినేటర్‌ కుతుబుద్దీన్‌, హజ్‌ హౌస్‌ చైర్మన్‌ గౌసుల్లాజం, నాయకులు అహమ్మద్‌ బాషా, షేక్‌ ఉమెర్‌, సయ్యద్‌ జైద్‌, డాక్టర్‌ సోహేల్‌, అఫ్జల్‌ ఖాన్‌, స్థానిక, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

➡️