‘మనఊరుకి మన శివన్న

‘ప్రజాశక్తి-దర్శి : తాళ్లూరు మండల పరిధిలోని తూర్పు గంగవరం, రామభద్రాపురం గ్రామాల్లో మన ఊరికి, మన శివన్న కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి దర్శి నియోజక వర్గ అభ్యర్థి బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి స్థానికులకు ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, బూచేపల్లి నందిని, పిఎసిఎ చైర్‌పర్సన్‌ యల్లమందారెడ్డి, యోగిరెడ్డి, గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, జె.శ్రీనివవాసరావు, వైసిపి మండల అధ్యక్షుడు తూము సుబ్బారెడ్డి, మధుసూదరెడ్డి, రామిరెడ్డి, మోషే తదితరులు పాల్గొన్నారు.

➡️