మళ్లీ సిఎంగా జగన్‌నే గెలిపించుకోవాలి

Jan 21,2024 21:46
ఫొటో : మహిళలతో మాట్లాడుతున్న మేకపాటి రాజగోపాల్‌రెడ్డి

ఫొటో : మహిళలతో మాట్లాడుతున్న మేకపాటి రాజగోపాల్‌రెడ్డి
మళ్లీ సిఎంగా జగన్‌నే గెలిపించుకోవాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నవరత్నాలు ప్రతి ఇంటికి చేరాలంటే మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రావాలని నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని క్రిష్ణంపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో పాల్గొన్న ఆయన గడపగడప తిరుగుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు తీరును పదకాల చేరువను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగనన్ననే కావాలి జగనే మళ్లీమళ్లీ రావాలి అనే నినాదంతో కృష్ణంపల్లి ప్రజల నుండి యువత నుండి నినాదాలు సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఈశ్వరమ్మ, మాజీ ఎంపిపి చేజర్ల సుబ్బారెడ్డి, జెడ్‌పిటిసి మోడీ రామాంజనేయులు, మండల కన్వీనర్‌ ఓబుల్‌ రెడ్డి, జిల్లా కోఆప్షన్‌ సభ్యులు గాజుల తాజుదుద్దీన్‌, సర్పంచులు అక్కి ప్రమీల, ఎం.నారాయణమ్మ, సాహిత్య అకాడమీ డైరెక్టర్‌ అక్కి భాస్కర్‌ రెడ్డి, సచివాలయం మండల కన్వీనర్‌ అధ్యక్షులు కృష్ణారెడ్డి, 8 మండలాల జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

➡️