మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ

మాచర్ల: నిరుపేద మహిళలకు కుట్టు శిక్షణ నేర్పించి, వారికి ఉచితంగా కుట్టుమిషన్లు కూడా పంపిణీ చేస్తున్న పూజిత మహిళా సొసైటీ ఆఫ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ సేవలు అభినందనీయమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక నరిసెట్టి కళ్యాణ మండపంలో సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం మహిళలకు 60 కుట్టుమిషన్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి అనేక సంక్షేమ పథ కాలను అందిస్తున్నారని తెలిపారు ప్రభుత్వ సంక్షేమ పద ¸కాలను అందిపుచ్చుకొని మహిళలు స్వయం సాధికారతవైపు నడవాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షురాలు ఎర్ర బోతుల కోటేశ్వరి, మున్సిపల్‌ చైర్మన్‌ మాచర్ల చిన్న ఏసోబు, మాజీ చైర్మన్‌ రఘురామిరెడ్డి, కౌన్సిలర్‌ పట్టణ వైసిపి అధ్యక్షుడు పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️