మహిళలు రాణించాలి: ఎంపీపీ

ప్రజాశక్తి-కొమరోలు: మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని, ఆదర్శంగా నిలుస్తూ కుటుంబాలకే వెన్నుదన్నుగా ఉంటున్నారని ఎంపీపీ కామూరి అమూల్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరిం చుకొని బుధవారం స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయంలో ఎంపీపీ కామూరి అమూల్యకు ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ వసంత, అంగన్‌వాడీ కార్యకర్తలు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళ లేనిదే సమాజ మనుగడ లేదన్నారు. అనంతరం అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఆయాలకు నిర్వహించిన ఆటల పోటీలను ఎంపీపీ అమూల్య ప్రారంభించారు.

➡️