మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : డిసి

ప్రజాశక్తి-కాశినాయన మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ డిసి.గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా అన్నారు. శనివారం మండల కేంద్రమైన నరసాపురంలోని జడ్పీ హైస్కూల్‌ ఆవరణంలో వెలుగు పథకం ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం ఎంతో అండగా ఉంటూ వారి అభివద్ధికి నిరంతరం కషి చేస్తుందని తెలిపారు. మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమానికి వైసిపి మండల కన్వీనర్‌ విశ్వనాథరెడ్డి, ఎంపిపి పోలమ్మ, బద్వేల్‌ మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ రమణారెడ్డి, సచివాలయాల కన్వీనర్‌ హనుమంతురెడ్డి, నాయకులు ఆదిత్యరెడ్డి, వెలుగు ఏరియా కో-ఆర్డినేటర్‌ సుబ్బారెడ్డి, ఎపిఎం రామాంజనేయులు, వెలుగు సిసిలు, సిబ్బంది, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు

➡️